Srilakshmi : సీనియర్‌ ఐఏఎస్‌ శ్రీలక్ష్మికి హైకోర్టులో చుక్కెదురు

Srilakshmi : 'సేవా శిక్ష'పై హైకోర్టులో రివ్యూ పిటిషన్‌ వేసినా సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి శ్రీలక్ష్మికి ఊరట లభించలేదు.

Update: 2022-04-13 12:30 GMT

Srilakshmi : 'సేవా శిక్ష'పై హైకోర్టులో రివ్యూ పిటిషన్‌ వేసినా సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి శ్రీలక్ష్మికి ఊరట లభించలేదు. ఇవాళ వాదనల తర్వాత గతంలో తామిచ్చిన తీర్పులో మార్పులు చేసేందుకు కోర్టు నిరాకరించింది. పాఠశాలల ప్రాంగాణాల్లో రైతు భరోసా కేంద్రాలు, సచివాలయాల నిర్మాణం వద్దంటూ హైకోర్టు ఆదేశించినా పలువురు IASలు దాన్ని అమలు చేయలేదు.

దీనిపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన న్యాయస్థానం 8 మంది ఐఏఎస్‌లకు 2 వారాలపాటు జైలు శిక్ష విధించింది. వెంటనే వారు కోర్టుకు క్షమాపణలు చెప్పడంతో జైలు శిక్ష బదులు సేవా శిక్ష అమలు చేయాలని ఆదేశించింది. ఏడాదిపాటు ప్రతినెల ఒకరోజు సంక్షేమ హాస్టళ్లకు ఐఏఎస్‌లు వెళ్లాలని, అక్కడ పిల్లలతో గడపాలని ఆదేశించింది.

ఈ సేవా శిక్షను ఐఏఎస్‌ అధికారులు అంతా అంగీకరించినా.. దాన్ని రద్దు చేయాలంటూ శ్రీలక్ష్మి రివ్యూ పిటిషన్‌ వేశారు. ఐనా ఊరట మాత్రం దొరకలేదు.

Full View


Tags:    

Similar News