AP High Court: రాష్ట్రంలో అభివృద్ధి అంతా నిలిచిపోయినట్టు అనిపిస్తోంది: ఏపీ హైకోర్టు వ్యాఖ్యలు
AP High Court: రాజధాని అమరావతి కేసులపై విచారణ ప్రారంభించిన ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.;
AP High Court (tv5news.in)
AP High Court: రాజధాని అమరావతి కేసులపై విచారణ ప్రారంభించిన ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కేసుల విచారణ పెండింగ్‌లో ఉండడంతో రాష్ట్రంలో అభివృద్ధి అంతా నిలిచిపోయినట్టు అనిపిస్తోందంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సిజే ప్రశాంత్‌కుమార్ మిశ్రా. పిటిషనర్లతో పాటు అందరూ ఇబ్బందులు పడుతున్నట్టు అనిపిస్తోందని ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ అభిప్రాయపడ్డారు.
కేసుల విచారణను త్వరగా చేపట్టి ముగిస్తామని చెప్పారు చీఫ్ జస్టిస్ మిశ్రా. రాజధాని కేసుల విచారణకు ఎంతో ప్రాముఖ్యత ఉందన్న హైకోర్టు.. ఇవాళ్టి నుంచి అమరావతి కేసుల రోజువారీ విచారణ చేపడతామని స్పష్టం చేసింది. రాజధాని కేసుల విచారణను త్రిసభ్య ధర్మాసనం చేపట్టనుంది. అయితే, ఈ కేసుల విచారణ నుంచి ఇద్దరు న్యాయమూర్తులను తప్పించాలన్న ప్రభుత్వం కోరింది.
త్రిసభ్య ధర్మాసనం నుంచి జస్టిస్ సత్యనారాయణమూర్తి, జస్టిస్ సోమయాజులును తప్పించాలని ప్రభుత్వం తరపు న్యాయవాది కోరారు. అయితే, ప్రభుత్వ విజ్ఞప్తిని ధర్మాసనం తిరస్కరించింది. రైతుల తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది శ్యామ్ దివాన్ వాదనలు వినిపిస్తున్నారు