భారీ వర్షాలతోపాటు ఎగువ ప్రాంతాల నుంచి వరదనీరు చేరడంతో ఏలూరు జిల్లా పోలవరం వద్ద గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఈ వరద కారణంగా పోలవరం జలాశయం నీటిమట్టం భారీగా పెరుగుతోంది. దీంతో అధికారులు ప్రాజెక్ట్ రేడియల్ గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు గోదావరికి పెద్దఎత్తున వరద వచ్చి చేరుతోంది. లవరం ప్రాజెక్టులోకి వస్తున్న 2,37,203 క్యూసెక్కుల నీటిని స్పిల్వే 48 గేట్ల నుంచి దిగువకు విడుదల చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. మరోవైపు.. చంద్రబాబు ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన పోలవరం ప్రాజెక్టు పనులు వేగం పుంజుకున్నాయి. ఇప్పటికే పోలవరం కుడి ప్రధాన కాలువ పనులు సుమారుగా పూర్తయ్యాయి. ఎడమ ప్రధాన కాలువ పనులు కూడా వేగవంతం చేశారు. ఈ నెలాఖరుకల్లా పూర్తి చేయాలనే లక్ష్యంతో 8 ప్యాకేజీల కింద విభజించి పనులు చేస్తున్నారు. 38,060 నిర్వాసితులకు పునరావాసం కల్పించాల్సి ఉంది.