మందు బాబులకు గుడ్ న్యూస్.. ఏపీలో మద్యం ధరలు సవరిస్తూ ఉత్తర్వులు

ఏపీ సర్కార్ దేశీయంగా తయారైన విదేశీ మద్యం ధరలను తగ్గించింది. ఇక బీర్లపై 30 రూపాలయను తగ్గించింది.

Update: 2020-09-03 12:12 GMT

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం దేశీయంగా తయారైన విదేశీ మద్యం ధరలను తగ్గించింది. 150 రూపాయల కంటే తక్కువ ధరలు ఉన్న మద్యం ధరలను తగ్గిస్తున్నట్లు తెలిపింది. 190 నుంచి 6వందల వరకు ఉన్న మద్యం ధరలను పెంచింది. గురువారం నుంచే ఈ సవరించిన మద్యం ధరలు అమలు కానున్నాయి. ఇక బీర్లపై 30 రూపాలయను ప్రభుత్వం తగ్గించింది.
 

ఇతర రాష్ట్రాల నుంచి మద్యం అక్రమ రవాణాను అరికట్టేందుకు ధరలను సవరించాలని ఎస్ ఈబీ సిఫార్స్ మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

మద్యం ధరలు పెరుగడంతో మద్యం ప్రియులు శానిటైజర్లు, మిథైల్ ఆల్కాహాల్ సేవించి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్న సంగతి తెలిసిందే. దీంతో ఎస్ ఈ బీ మద్యం ధరలను సవరించాలంటూ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. దీన్ని పరిశీలించిన ప్రభుత్వం ధరలను తగ్గించింది. 180 ml బాటిల్ ధర 120 రూపాయలకు మించని బ్రాండ్లకు 30 నుంచి 20 రూపాయల వరకు తగ్గించింది ప్రభుత్వం.

Tags:    

Similar News