AP: :మిథున్‌రెడ్డి అరెస్ట్‌కు రంగం సిద్ధం ?

కీలక మలుపు తిరిగిన ఏపీ లిక్కర్ స్కాం;

Update: 2025-04-07 05:30 GMT

ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కాం కేసులో కీలక మలుపు తిరిగింది. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ పై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించగా, సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఇదిలా ఉండగా, మిథున్ రెడ్డిని ఎప్పుడు, ఎలా అరెస్టు చేయాలా అనే అంశంపై ఏపీ సీఐడీ వేచి చూస్తోంది. వైసీపీ వర్గాల్లో నుంచి సీఐడీ బృందాలు ఢిల్లీకే వెళ్లాయన్న ప్రచారం ఊపందుకుంది. అయితే ఇప్పటివరకు లిక్కర్ స్కాం కేసులో ఒక్కరిని కూడా సీఐడీ అరెస్ట్ చేయలేదు. నిందితులకు న్యాయపరమైన అవకాశాలు కల్పిస్తూ, హడావుడిగా ఆపరేషన్లు చేపట్టకపోవడం గమనార్హం.

రాజ్ కసిరెడ్డికి సీఐడీ నోటీసులు

ఇప్పటికే రాజ్ కసిరెడ్డికి సీఐడీ నోటీసులు జారీ చేసింది. అయితే విచారణకు హాజరుకాలేని ఆయన పిటిషన్లు హైకోర్టు కొట్టివేయడంతో,  అరెస్టుకు బ్రేక్ పడింది. విచారణకు హాజరుకాకపోతే, ముందుగా రాజ్ కసిరెడ్డినే అరెస్టు చేసే అవకాశముంది. వైసీపీ వర్గాలు మిథున్ రెడ్డి అరెస్ట్ కోసం ఎందుకింత తహతహలాడుతున్నాయో అర్ధం కావడం లేదు. కానీ ఈ అరెస్ట్ చట్టబద్ధంగా మాత్రమే జరుగుతుందని, రాజకీయ కక్షలు గల కుట్రగా మార్చాలని చూస్తే ప్రజలు గమనిస్తారని టీడీపీ నేతలు అంటున్నారు. లిక్కర్ స్కాంలో మిథున్ రెడ్డి మాత్రమే కాక, చివరికి అంతిమ లబ్దిదారుడి వరకు కేసు చేరుతుందని సమాచారం.  ఈ నేపథ్యంలో మిథున్ అరెస్ట్‌పై రాజకీయ వేడి మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు ఇటీవల మిథున్‌రెడ్డికి ఏపీ హైకోర్టులో చుక్కెదురైంది. ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది.మద్యం విక్రయాలు, తయారీలో అవకతవకల్లో మిథున్‌రెడ్డి ప్రమేయం ఉందంటూ సీఐడీ కేసు నమోదు చేసింది.


Tags:    

Similar News