Minister Kollu Ravindra : ఏపీ లిక్కర్ స్కామ్..ప్రపంచంలోనే అతిపెద్ద..

Update: 2025-07-09 06:15 GMT

ఏపీ లిక్కర్ స్కామ్ ప్రపంచంలోనే అతిపెద్ద కుంభకోణం అని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. 5ఏళ్లలో జగన్ సర్కార్ ఎన్నో స్కాములకు పాల్పడిందని ఆరోపించారు. గత ప్రభుత్వం ఐదేళ్లు ఇసుకలో భారీ దోపిడీ చేసిందన్న ఆయన... లిక్కర్‌ స్కామ్‌లో చీమల పుట్ట కదుపుతుంటే అందరి పేర్లు బయటకు వస్తున్నాయని వ్యాఖ్యానించారు. కొడాలి నాని, జోగి రమేష్, వంశీ అవినీతి బాగోతాలు బయటకు వస్తున్నాయన్నారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు చూసి ఓర్వలేక ప్రజల్లో అలజడులు సృష్టిస్తున్నారని ఆరోపించారు.

గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించే విధంగా కృషి చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. గాడి తప్పిన పరిపాలనను గాడిలో పెట్టామన్న ఆయన... ఒకటో తేదిన జీతాలు, పింఛన్లు ఇస్తున్నట్లు చెప్పారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తుందని.. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా పనిచేస్తుందని తెలిపారు. చదువు భారం కాకూడదనే ఉద్ధేశ్యంతోనే తల్లికి వందనం కుటుంబంలోని పిల్లలందరికీ ఇస్తున్నట్లు వెల్లడించారు.

Tags:    

Similar News