AP: ఖాకీలనే వణికించిన నెల్లూరు కిలేడీ

అక్రమాలతో రెచ్చిపోయిన మహిళ... అత్యున్నత అధికారుల పేర్లతో పైరవీలు... వైసీపీ హయాంలో పేట్రేగిపోయిన లేడీ డాన్;

Update: 2025-08-18 05:00 GMT

ఒక­ప్పు­డు ఆమె చి­న్న బొ­టి­క్‌ ని­ర్వ­హిం­చు­కు­నే­వా­రు. వై­సీ­పీ హయాం­లో ఆ పా­ర్టీ నా­య­కుల అం­డ­దం­డ­లు, అప్ప­ట్లో జి­ల్లా­లో పని­చే­సిన ఓ పో­లీ­సు ఉన్న­తా­ధి­కా­రి­తో సన్ని­హిత సం­బం­ధా­ల­తో ఆ ఐదే­ళ్ల­లో అత్యంత ‘పవ­ర్‌­ఫు­ల్‌’గా తయా­ర­య్యా­రు. జి­ల్లా­లో­ని పో­లీ­స్‌­స్టే­ష­న్ల­ను తన కను­సై­గ­ల­తో శా­సిం­చేం­త­గా తయా­రై.. సె­టి­ల్‌­మెం­ట్లు, దం­దా­ల­తో పే­ట్రే­గి­పో­యా­రు. డె­న్లు ఏర్పా­టు­చే­సు­కు­ని రౌ­డీ­షీ­ట­ర్ల­తో గ్యాం­గ్‌­లు నడి­పిం­చా­రు. గం­జా­యి స్మ­గ్లిం­గ్‌ చే­యి­స్తూ.. రూ.కో­ట్లు కూ­డ­బె­ట్టా­రు. తనను తాను ఓ స్వ­చ్ఛంద సం­స్థ కా­ర్య­ద­ర్శి­గా పరి­చ­యం చే­సు­కుం­టూ ఈ దం­దా­లు చే­సే­వా­రు. కూ­ట­మి ప్ర­భు­త్వం వచ్చాక కొ­న్నా­ళ్ల పాటు వ్యూ­హా­త్మక మౌనం పా­టిం­చిన ఆమె తా­జా­గా మళ్లీ పై­ర­వీ­లు, దం­దా­లు మొ­ద­లు­పె­ట్టే­శా­రు. ఓ హత్య కే­సు­లో దో­షి­గా తేలి యా­వ­జ్జీవ శి­క్ష అను­భ­వి­స్తు­న్న శ్రీ­కాం­త్‌ అనే ఖై­దీ­కి ని­బం­ధ­న­ల­కు వి­రు­ద్ధం­గా ఇటీ­వల పె­రో­ల్‌ ఇప్పిం­చ­టం­లో ఆమె­దే కీ­ల­క­పా­త్ర­ని సమా­చా­రం. . గత ప్ర­భు­త్వం­లో తా­డే­ప­ల్లి­కి తరచూ వచ్చి వె­ళ్తూ పె­ద్ద­ల్ని కలి­సి ఫొ­టో­లు దిగి సో­ష­ల్‌ మీ­డి­యా­లో బాగా ప్ర­చా­రం చే­సు­కుం­ది. ఆమె ఏకం­గా నె­ల్లూ­రు జి­ల్లా ఎస్పీ కా­ర్యా­ల­యం­లో కూ­ర్చు­ని.. ‘మీకు ఏమి కా­వా­లో చె­ప్పం­డి. నేను చె­బి­తే మీ ఎస్పీ చే­యా­ల్సిం­దే. నేను చూ­సు­కుం­టా’ అంటూ సీ­ఐ­లు, ఎస్‌­ఐ­ల­నే కమాం­డ్‌ చేసే స్థా­యి­కి చే­రిం­ది.

సచివాలయంలోనే...

రా­ష్ట్ర సచి­వా­ల­యం­లో­నే కూ­ర్చు­ని హల్‌­చ­ల్‌ చేసే స్థా­యి­కి ఎది­గిం­ది. నె­ల్లూ­రు జి­ల్లా­లో పేద కు­టుం­బం­లో జన్మిం­చిన ఆమె ఇప్పు­డు రా­ష్ట్రం­లో­నే అతి పె­ద్ద అధి­కా­రు­ల­తో పని చే­యి­స్తా అంటూ ఫో­న్లు చేసి బే­రా­లు పె­డు­తోం­ది. నె­ల్లూ­రు జి­ల్లా­లో ఆ మహిళ పేరు తె­లి­య­ని రా­జ­కీయ నా­య­కు­లు, పో­లీ­సు అధి­కా­రు­లు, క్రి­మి­న­ల్స్‌ అరు­దు. తప్పు­డు పను­లు వద్ద­ని వా­రిం­చిన భర్త రో­డ్డు ప్ర­మా­దం­లో ప్రా­ణా­లు కో­ల్పో­యా­డు. ఆ కేసు లో­తు­గా దర్యా­ప్తు చే­సేం­దు­కు ప్ర­య­త్నిం­చిన పో­లీ­సు అధి­కా­రి బది­లీ అయ్యా­రు. గతం­లో ఒక ఎస్పీ­తో కలి­సి ఆమె గోవా ట్రి­ప్పు వె­ళ్లిం­ది. అత్యంత సా­ధా­రణ కు­టుం­బం­లో జన్మిం­చిన ఆ మహిళ దశ వై­సీ­పీ ప్ర­భు­త్వం­లో ‘దిశ’తో ఎక్క­డి­కో మా­రి­పో­యిం­ది. నె­ల్లూ­రు­లో తనకు తాను మా­ర్కె­టిం­గ్‌ చే­సు­కు­ని, పో­లీ­సు పరి­చ­యా­లు పెం­చు­కు­ని ఎది­గేం­దు­కు ఎన్ని దా­రు­లుం­టా­యో అన్నీ ఎం­చు­కుం­ది. ఎమ్మె­ల్యే­గా పోటీ చేసే స్థా­యి­కి ఎది­గిం­ది. ఇప్పు­ు­డు ఈ మహిళ ఆట కట్టిం­చేం­దు­కు పో­లీ­సు­లు సమా­య­త్త­మ­వు­తు­న్నా­రు.

Tags:    

Similar News