AP Registrations changes : ఏపీ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియలో మార్పులు.. ఆధార్‌‌‌తో పాటుగా ఇవి కూడా తప్పనిసరి..!

AP Registrations changes : ఆంధ్రప్రదేశ్‌లో రిజిస్ట్రేషన్ ప్రక్రియలో సర్కారు కీలక మార్పులు చేసింది. ఇప్పటివరకు రిజిస్ట్రేషన్‌ ప్రక్రియలో ఆధార్‌ కార్డు తప్పనిసరి..;

Update: 2021-10-06 12:30 GMT

AP Registrations changes : ఆంధ్రప్రదేశ్‌లో రిజిస్ట్రేషన్ ప్రక్రియలో సర్కారు కీలక మార్పులు చేసింది. ఇప్పటివరకు రిజిస్ట్రేషన్‌ ప్రక్రియలో ఆధార్‌ కార్డు తప్పనిసరి అని నిబంధన ఉండగా.. ఇకపై ఆధార్‌ స్థానంలో ఇతర గుర్తింపు కార్డులకు చోటు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రిజిస్ట్రేషన్‌ ప్రక్రియలో మార్పులపై భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. ఇటీవల విశాఖలో 13 ప్రభుత్వ ఆస్తుల తనఖా వ్యవహారంలో ఆధార్‌ ఉపయోగించకుండానే రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను అధికారులు పూర్తి చేశారు. అయితే నిబంధనల ప్రకారం ఎస్‌బీఐ క్యాప్‌ ట్రస్టీకి చేసిన రిజిస్ట్రేషన్‌ చెల్లదని రిజిస్ట్రార్ల అభిప్రాయపడ్డారు. దీంతో హడావుడిగా రిజిస్ట్రేషన్‌ నిబంధనలనే మారుస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఆధార్‌ స్థానంలో పాన్‌ కార్డు, డ్రైవింగ్‌ లైసెన్స్‌, ఓటర్‌ కార్డు, ఫోటో ఉన్న రేషన్ కార్డు, పాస్‌పోర్టు ఉపయోగించవచ్చని ఉత్తర్వుల్లో తెలిపారు.

Tags:    

Similar News