AP: ఆంధ్రప్రదేశ్‌ను ఆందోళన పరుస్తున్న టీనేజ్ ప్రెగ్నెన్సీలు

ఏపీలో ప్రమాదకరస్థాయికి టీనేజ్ ప్రెగ్నెన్సీలు... చాలా జిల్లాల్లో 12 శాతానికి మించి నమోదు

Update: 2026-02-09 11:00 GMT

టీనేజ్ వయసులో గర్భధారణలు పెరుగుతున్నాయంటే అది అది సమాజ భవిష్యత్తుకు పెను ప్రమాదం. చదువు మధ్యలో ఆగిపోవడం, బాల్య వివాహాల ప్రభావం, సరైన అవగాహన లోపం, ఆరోగ్య సమస్యలు, తల్లి–శిశు మరణాల ముప్పు… ఇవన్నీ టీనేజ్ ప్రెగ్నెన్సీలతో ముడిపడి ఉన్న తీవ్రమైన పరిణామాలు. ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాజాగా వెలుగులోకి వచ్చిన గణాంకాలు ఆందోళన కలిగిస్తున్నాయి. రాష్ట్రంలో చాలా జిల్లాల్లో టీనేజ్ ప్రెగ్నెన్సీలు ప్రమాదకర స్థాయికి చేరుకున్నట్టు అధికారిక లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. 2025–26 సంవత్సరానికి సంబంధించిన తాజా గణాంకాల ప్రకారం, ఆంధ్రప్రదేశ్‌లో అనేక జిల్లాల్లో టీనేజ్ ప్రెగ్నెన్సీ రేటు 12 శాతానికి మించి నమోదైంది. ముఖ్యంగా నెల్లూరు, పల్నాడు, ప్రకాశం, అనంతపురం, బాపట్ల, కర్నూలు జిల్లాలు ఈ విషయంలో టాప్‌లో నిలిచాయి. ఈ జిల్లాల్లో ప్రతి వంద మంది టీనేజ్ బాలికల్లో కనీసం 12 మందికి పైగా గర్భధారణ నమోదవడం తీవ్ర పరిస్థితిని సూచిస్తోంది. వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఇది భవిష్యత్తులో మరిన్ని సామాజిక, ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చని హెచ్చరిస్తున్నారు.

ఇక కొ­న్ని జి­ల్లా­ల్లో పరి­స్థి­తి కొంత తక్కు­వ­గా ఉన్న­ప్ప­టి­కీ, అది కూడా సు­ర­క్షిత స్థా­యి­లో లే­ద­నే చె­ప్పా­లి. ఏలూ­రు, అన్న­మ­య్య, చి­త్తూ­రు, తి­రు­ప­తి, సత్య­సా­యి, నం­ద్యాల జి­ల్లా­ల్లో టీ­నే­జ్ ప్రె­గ్నె­న్సీ­లు 10 నుం­చి 12 శాతం మధ్య­లో నమో­ద­య్యా­యి. ఈ గణాం­కా­లు కూడా ని­ర్ల­క్ష్యం చే­య­ద­గ్గ­వి కా­ద­ని ని­పు­ణు­లు చె­బు­తు­న్నా­రు. టీ­నే­జ్ దశలో అమ్మా­యిల శరీ­రం పూ­ర్తి­గా ఎద­గ­క­ముం­దే గర్భ­ధా­రణ జరి­గి­తే, తల్లి ఆరో­గ్యం­తో పాటు శి­శు­వు ఆరో­గ్యం­పై కూడా తీ­వ్ర­మైన ప్ర­భా­వం పడే అవ­కా­శం ఉం­ద­ని వారు పే­ర్కొం­టు­న్నా­రు.

అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పు గోదావరి, గుంటూరు జిల్లాల్లో 8 నుంచి 10 శాతం మధ్యలో టీనేజ్ ప్రెగ్నెన్సీలు నమోదయ్యాయి. ఈ జిల్లాల్లో పరిస్థితి కొంత నియంత్రణలో ఉన్నట్లు కనిపిస్తున్నా, ఇంకా లక్ష్య స్థాయికి దూరంగానే ఉంది. రాష్ట్రవ్యాప్తంగా చూస్తే, టీనేజ్ గర్భధారణలు ఒక జిల్లాకే పరిమితం కాకుండా, దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ విస్తరించిన సమస్యగా మారినట్టు గణాంకాలు చెబుతున్నాయి. విశాఖపట్నం జిల్లాలో మాత్రమే టీనేజ్ ప్రెగ్నెన్సీలు అత్యల్పంగా 3.98 శాతంగా నమోదయ్యాయి. ఇది ప్రభుత్వ చర్యలు, విద్యా అవగాహన కార్యక్రమాలు, వైద్య సేవల అందుబాటు వల్ల సాధ్యమై ఉండొచ్చని అంచనా. మిగిలిన తొమ్మిది జిల్లాల్లో మాత్రం టీనేజ్ గర్భధారణలు ఓ మాదిరి స్థాయిలో కొనసాగుతున్నట్టు గణాంకాలు సూచిస్తున్నాయి. ప్రభుత్వం ఇప్పటికే ఈ సమస్యపై దృష్టి సారించింది. 2026–27 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్రవ్యాప్తంగా టీనేజ్ ప్రెగ్నెన్సీ రేటు 5 శాతానికి మించకుండా తగ్గించాలనే లక్ష్యాన్ని పెట్టుకుంది. రాష్ట్ర సగటు టీనేజ్ ప్రెగ్నెన్సీ రేటు 8.8 శాతంగా ఉండటం తీవ్ర ఆందోళనకు కారణమవుతోంది. ఈ లక్ష్యాన్ని సాధించాలంటే కేవలం ప్రభుత్వ చర్యలే కాకుండా సమాజం కూడా జాగురుతం చేయాలి.

Tags:    

Similar News