AP: ఏపీలో ప్రతి ఇంటికీ రక్షిత తాగునీరు

పవన్ చొరవతోనే గడువు పొడిగింపు... పవన్ ప్రతిపాదనకు కేంద్రం సమ్మతి... జల్ జీవన్ మిషన్ పనులపై వ్యూహం

Update: 2025-10-19 05:30 GMT

ఆం­ధ్ర­ప్ర­దే­శ్ రా­ష్ట్రం­లో­ని ప్ర­తి ఇం­టి­కి సు­ర­క్షిత తా­గు­నీ­రు అం­దిం­చా­ల­న్న­దే ఎన్డీ­యే కూ­ట­మి ప్ర­భు­త్వ లక్ష్యం అని డి­ప్యూ­టీ సీఎం కా­ర్యా­ల­యం ప్ర­క­టిం­చిం­ది. జల్ జీ­వ­న్ మి­ష­న్ పను­ల­పై పక్కా ప్ర­ణా­ళి­క­తో ముం­దు­కు వె­ళ్తు­న్నా ఉప ము­ఖ్య­మం­త్రి, పం­చా­య­తీ­రా­జ్, గ్రా­మీ­ణా­భి­వృ­ద్ధి, ఆర్.డబ్ల్యూ.ఎస్. శాఖల మం­త్రి పవన్ కళ్యా­ణ్.. ఇం­టిం­టి­కి సు­ర­క్షిత తాగు నీటి సర­ఫ­రా లక్ష్యం­గా పను­ల్లో వేగం పుం­జు­కుం­ది. తొ­లి­సా­రి గ్రా­మీణ తాగు నీటి సర­ఫ­రా వి­భా­గం మొ­త్తం సి­బ్బం­ది­కి శి­క్ష­ణా తర­గ­తు­లు ని­ర్వ­హిం­చా­రు. శాఖ అం­త­ర్గత సా­మ­ర్థ్యం పెం­పు లక్ష్యం­గా ప్ర­ణా­ళి­క­లు రూ­పొం­దిం­చా­రు. నీటి శు­ద్ధి, నా­ణ్యత, సర­ఫ­రా­కు అత్యంత ప్రా­ధా­న్యం ఇచ్చి­న­ట్లు పే­ర్కొ­న్నా­రు. ఏడా­ది­లో రూ. 7,910 కో­ట్ల జల్ జీ­వ­న్ పను­ల­కు శ్రీ­కా­రం చు­ట్ట­గా, ఉప ము­ఖ్య­మం­త్రి పవన్ కళ్యా­ణ్ కృ­షి­తో గడు­వు­ను కేం­ద్ర ప్ర­భు­త్వం పొ­డి­గిం­చిం­ది. నీటి నా­ణ్యత.. శు­ద్ధి.. సర­ఫ­రా­ల­కు ప్రా­ధా­న్యత ఇస్తూ ము­ను­పె­న్న­డూ లేని వి­ధం­గా క్షే­త్ర స్థా­యి­లో చి­న్న ఉద్యో­గి నుం­చి రా­ష్ట్ర స్థా­యి­లో­ని ఉన్నత స్థా­యి ఇం­జి­నీ­ర్ వరకు... గ్రా­మీణ రక్షిత తా­గు­నీ­టి సర­ఫ­రా వి­భా­గం సి­బ్బం­ది­లో అం­త­ర్గత సా­మ­ర్థ్యా­లు పెం­చే­లా శి­క్షణ ఇస్తు­న్నా­రు.

ప్రకాశం జిల్లాలో అతి పెద్ద తాగునీటి ప్రాజెక్టు

జల్ జీ­వ­న్ మి­ష­న్ పథకం కింద గత జులై 4వ తేదీ ప్ర­కా­శం జి­ల్లా పశ్చిమ ప్రాం­తా­ని­కి తాగు నీటి కష్టా­లు తీ­ర్చ­డ­మే లక్ష్యం­గా 1,290 కో­ట్ల­తో మెగా ప్రా­జె­క్టు­కు ఉప ము­ఖ్య­మం­త్రి పవన్ కళ్యా­ణ్ శం­కు­స్థా­పన చే­శా­రు. ఈ ప్రా­జె­క్టు­తో ఫ్లో­రై­డ్ సమ­స్య­తో ఇబ్బం­ది­ప­డు­తు­న్న పశ్చిమ ప్ర­కా­శం ప్రాంత ప్ర­జల తా­గు­నీ­టి అవ­స­రా­లు తీ­రు­తా­యి. దే­శా­ని­కి స్వా­తం­త్ర్యం వచ్చిన తర్వాత ప్ర­కా­శం జి­ల్లా పరి­ధి­లో ఇంత పె­ద్ద తా­గు­నీ­టి ప్రా­జె­క్టు ప్రా­రం­భిం­చ­టం ఇదే ప్ర­థ­మం. దీం­తో పాటు ఉమ్మ­డి తూ­ర్పు, పశ్చిమ గో­దా­వ­రి జి­ల్లా­లు, గుం­టూ­రు, చి­త్తూ­రు జి­ల్లా­ల్లో తాగు నీటి సర­ఫ­రా మెగా ప్రా­జె­క్టు­లు ప్రా­రం­భో­త్స­వా­ని­కి సి­ద్ధం­గా ఉన్నా­యి. ప్ర­తి పని­ని పవన్ కళ్యా­ణ్ స్వ­యం­గా పర్య­వే­క్షి­స్తూ ముం­దు­కు తీ­సు­కు­వె­ళ్తు­న్నా­రు.డి­ప్యూ­టీ సీఎం పవన్ కళ్యా­ణ్ ని­బ­ద్దత, దూ­ర­దృ­ష్టి­తో గ్రా­మీణ తా­గు­నీ­టి సర­ఫ­రా వి­భా­గా­న్ని మరింత బలో­పే­తం చేసే చర్య­లు చక­చ­కా ముం­దు­కు సా­గు­తు­న్నా­యి. 5 జి­ల్లాల పరి­ధి­లో రూ.7,910 కో­ట్ల పను­ల­ను పథకం వి­స్త­ర­ణ­లో ప్రా­రం­భిం­చి దా­ని­కి అను­గు­ణం­గా పను­ల­ను చే­స్తు­న్నా­రు. ఈ ప్రా­జె­క్టు­లు పూ­ర్త­యి­తే కోటి మంది దా­హా­ర్తి తీ­రు­తుం­ది. రా­ను­న్న 30 ఏళ్ల కా­లా­ని­కి, కోటీ 21 లక్షల 71 వేల మం­ది­కి రక్షిత మం­చి­నీ­టి ఇవ్వా­ల­న్న సం­క­ల్పం నె­ర­వే­రు­తుం­ది.

Tags:    

Similar News