ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు కీలక అప్‌డేట్ వచ్చేసింది. పబ్లిక్ ఎగ్జామ్స్ నిర్వహణకు సంబంధించిన కీలక ఉత్తర్వులు ఏపీ విద్యాశాఖ విడుదల చేసింది. వచ్చే ఏడాది జరగనున్న పదో తరగతి పరీక్షలు మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు నిర్వహిస్తామని విద్యాశాఖ అధికారులు స్పష్టం చేశారు. ఇదే ప్రకటనలో ఏఏ సబ్జెక్ట్ పరీక్షలు ఏఏ తేదీల్లో జరుగుతాయనే దానిపై కూడా క్లారిటీ ఇచ్చారు. విద్యార్థులు ఈ షెడ్యూల్‌ను అనుసరించి తమ పరీక్షలకు సన్నద్ధం కావాల్సి ఉంటుంది. ప్రతిరోజూ ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. ఈ ప్రకటనతో విద్యార్థులకు పరీక్షల సన్నద్ధతపై స్పష్టత వచ్చింది. హాల్ టికెట్లు, ఇతర వివరాల కోసం అధికారిక వెబ్సైట్ bse.ap.gov.in ను సంప్రదించాలని అధికారులు సూచించారు.
పరీక్షల తేదీల పూర్తి వివరాలు
మార్చి 16: ఫస్ట్ లాంగ్వేజ్ (పేపర్-1)
మార్చి 18: సెకండ్ లాంగ్వేజ్
మార్చి 20: ఇంగ్లీష్
మార్చి 23: గణితం
మార్చి 25: ఫిజిక్స్ (భౌతికశాస్త్రం)
మార్చి 28: బయాలజీ (జీవశాస్త్రం)
మార్చి 30: సోషల్ స్టడీస్ (సాంఘికశాస్త్రం)
మార్చి 31: ఫస్ట్ లాంగ్వేజ్ (కాంపోజిట్ పేపర్-2)
ఏప్రిల్ 1: OSSSC సెకండ్ లాంగ్వేజ్ (పేపర్-2