అదానీ, అంబానీలు దోపిడి చేస్తున్నబీజేపీకి పట్టదు : సీపీఐ రామకృష్ణ
బీజేపీ పాలనలో దేశవ్యాప్తంగా రైతులు, శ్రామికులు అన్నమో రామచంద్ర అంటూ ఆకలితో అలమటించే పరిస్థితి వచ్చిందన్నారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ.;
బీజేపీ పాలనలో దేశవ్యాప్తంగా రైతులు, శ్రామికులు అన్నమో రామచంద్ర అంటూ ఆకలితో అలమటించే పరిస్థితి వచ్చిందన్నారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. గుంటూరు జిల్లాలో సీపీఐ పార్టీ జిల్లా పొలిటికల్ వర్కషాప్‌ను ప్రారంభించిన ఆయన... కేంద్రంపై విరుచుకుపడ్డారు. అదానీ, అంబానీలు దోపిడి చేస్తున్న బీజేపీ నేతలు చోద్యం చూస్తున్నారంటూ మండిపడ్డారు.ఇక జగన్ పోలవరం పర్యటన ఎందుకు చేస్తున్నారో ఆయనకే తెలియడం లేదంటూ ఎద్దేవా చేశారు.