AP: కేసులు, నోటీసులు, విమర్శలతో వైసీపీ ఉక్కిరి బిక్కిరి

ఏపీలో వైసీపీ నేతలకు వరుస షాకులు... తాజాగా మరో ఇద్దరు నేతలపై కేసులు...రజనీ, బ్రహ్మనాయుడిపై పోలీస్ కేసులు

Update: 2026-02-03 11:00 GMT

ఆం­ధ్ర­ప్ర­దే­శ్‌ రా­జ­కీయ వా­తా­వ­ర­ణం మరింత ఉద్రి­క్తం­గా మా­రు­తోం­ది. అధి­కార, వి­ప­క్ష పా­ర్టీల మధ్య మాటల యు­ద్ధం, పర­స్పర ఆరో­ప­ణ­లు, కే­సు­లు–నో­టీ­సు­ల­తో రా­జ­కీయ వేడి తా­రా­స్థా­యి­కి చే­రు­తోం­ది. ఈ నే­ప­థ్యం­లో ప్ర­తి­ప­క్ష వై­ఎ­స్సా­ర్ కాం­గ్రె­స్ పా­ర్టీ­కి చెం­దిన పలు­వు­రు కీలక నే­త­లు పో­లీ­సు చర్య­ల­తో ఎదు­రు­దె­బ్బ­లు తగు­లు­తు­న్నా­యి. వరు­స­గా కే­సు­లు నమో­దు కా­వ­డం, నో­టీ­సు­లు అం­దు­కో­వ­డం రా­ష్ట్ర రా­జ­కీ­యా­ల్లో హా­ట్‌­టా­పి­క్‌­గా మా­రిం­ది. ఇటీ­వల తి­రు­మల లడ్డూ కల్తీ వ్య­వ­హా­రం రా­జ­కీయ రం­గు­ను సం­త­రిం­చు­కో­వ­డం­తో అధి­కార పా­ర్టీ, వి­ప­క్షాల మధ్య తీ­వ్ర వా­గ్వా­దం మొ­ద­లైం­ది. ఈ అంశం చు­ట్టూ జరి­గిన పరి­ణా­మా­లు ఏపీ రా­జ­కీ­యా­ల­ను పూ­ర్తి­గా వే­డె­క్కిం­చా­యి. పర­స్పర వి­మ­ర్శ­లు తీ­వ్ర­స్థా­యి­కి చే­ర­డం­తో పాటు, కొ­న్ని చో­ట్ల ఉద్రి­క్త ఘట­న­లు కూడా చోటు చే­సు­కు­న్నా­యి. ఈ క్ర­మం­లో­నే వై­సీ­పీ నే­త­ల­పై పో­లీ­సు చర్య­లు వరు­స­గా కొ­న­సా­గు­తు­న్న­ట్లు కని­పి­స్తోం­ది.

మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు

ఇప్ప­టి­కే పలు­వు­రు మాజీ మం­త్రు­లు, పా­ర్టీ నే­త­ల­పై కే­సు­లు నమో­దైన నే­ప­థ్యం­లో తా­జా­గా మరో ము­గ్గు­రు ప్ర­ముఖ వై­సీ­పీ నే­త­లు పో­లీ­సు చర్యల పరి­ధి­లో­కి వచ్చా­రు. మాజీ మం­త్రి వి­డ­దల రజి­ని, వి­ను­కొండ మాజీ ఎమ్మె­ల్యే బొ­ల్లా బ్ర­హ్మ­నా­యు­డు మీద కే­సు­లు నమో­దు­కా­గా, మరో మాజీ మం­త్రి కా­కా­ణి గో­వ­ర్ధ­న్ రె­డ్డి­కి పో­లీ­సు­లు నో­టీ­సు­లు జారీ చే­శా­రు. ఈ పరి­ణా­మా­ల­తో ప్ర­తి­ప­క్ష వై­సీ­పీ­లో ఆం­దో­ళన వా­తా­వ­ర­ణం నె­ల­కొం­ది. గుం­టూ­రు జి­ల్లా పరి­ధి­లో చో­టు­చే­సు­కు­న్న ఒక రా­జ­కీయ ఘర్షణ నే­ప­థ్యం­లో మాజీ మం­త్రి వి­డ­దల రజి­ని­పై కేసు నమో­దైం­ది. గత నె­లా­ఖ­రు­లో వి­డ­దల రజి­ని అను­చ­రు­లు, తె­లు­గు­దే­శం పా­ర్టీ నేతల మధ్య వా­గ్వా­దం చో­టు­చే­సు­కుం­ది. ఈ ఘటన క్ర­మం­గా ఉద్రి­క్త­త­కు దారి తీ­సి­న­ట్లు సమా­చా­రం. ఈ నే­ప­థ్యం­లో టీ­డీ­పీ నే­త­లు పో­లీ­సు­ల­కు ఫి­ర్యా­దు చే­శా­రు. ఫి­ర్యా­దు­ను స్వీ­క­రిం­చిన పో­లీ­సు­లు దర్యా­ప్తు చే­ప­ట్టి, వి­డ­దల రజి­ని­తో పాటు పలు­వు­రు వై­సీ­పీ నే­త­ల­పై కే­సు­లు నమో­దు చే­శా­రు. మొ­త్తం ఇరవై మం­ది­కి పైగా పా­ర్టీ కా­ర్య­క­ర్త­లు, నే­త­లు ఈ కే­సు­ల్లో నిం­ది­తు­లు­గా ఉన్న­ట్లు తె­లు­స్తోం­ది. ఈ ఘట­న­పై వై­సీ­పీ నే­త­లు స్పం­ది­స్తూ, రా­జ­కీయ కక్ష­తో­నే కే­సు­లు నమో­దు చే­స్తు­న్నా­ర­ని ఆరో­పి­స్తు­న్నా­రు. స్థా­నిక రా­జ­కీ­యా­ల్లో ఆధి­ప­త్య పో­రా­ట­మే ఈ ఘట­న­కు కా­ర­ణ­మ­ని వారు అం­టు­న్నా­రు. అయి­తే పో­లీ­సు­లు మా­త్రం ఫి­ర్యా­దుల ఆధా­రం­గా­నే చట్ట­ప­ర­మైన చర్య­లు తీ­సు­కు­న్నా­మ­ని స్ప­ష్టం చే­స్తు­న్నా­రు. అయితే దీనిని వైసీపీ తప్పుపడుతోంది.

మరోవైపు నెల్లూరు జిల్లాలో వైసీపీకి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి పోలీసులు నోటీసులు అందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అలాగే ఓ ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో ఆయనపై కేసులు నమోదైనట్లు సమాచారం. ఈ కేసుల నేపథ్యంలో విచారణకు హాజరుకావాలంటూ పోలీసులు నోటీసులు జారీ చేశారు. నేరుగా ఆయన నివాసానికి వెళ్లి నోటీసులు అందజేయడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ వ్యవహారంపై వైసీపీ వర్గాలు తీవ్రంగా స్పందిస్తున్నాయి. రాజకీయ విమర్శలను కూడా నేరంగా పరిగణిస్తూ కేసులు నమోదు చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని పార్టీ నేతలు అంటున్నారు. మరోవైపు అధికార పార్టీ నేతలు మాత్రం చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై చర్యలు తప్పవని వ్యాఖ్యానిస్తున్నారు.

ఇక గుంటూరు జిల్లా వినుకొండలో చోటుచేసుకున్న మరో ఘటన రాజకీయంగా చర్చనీయాంశమైంది. వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆలయ దర్శనానికి వెళ్లిన సందర్భంగా జరిగిన గందరగోళం ఈ కేసుకు కారణమైంది. ఆలయంలో ప్రత్యేక పూజల సందర్భంగా తోపులాట జరగడంతో ఓ పోలీసు కానిస్టేబుల్ గాయపడినట్లు ఫిర్యాదు అందింది. ఈ ఫిర్యాదు ఆధారంగా బొల్లా బ్రహ్మనాయుడుతో పాటు పలువురు వైసీపీ నేతలపై కేసులు నమోదు చేసినట్లు సమాచారం. ఈ ఘట­న­పై కూడా వై­సీ­పీ నే­త­లు అభ్యం­త­రం వ్య­క్తం చే­స్తు­న్నా­రు. ఆలయ దర్శన సమ­యం­లో జరి­గిన సా­ధా­రణ గం­ద­ర­గో­ళా­న్ని అతి­శ­య­ప­రు­స్తూ కే­సు­లు బనా­యిం­చా­ర­ని ఆరో­పి­స్తు­న్నా­రు. పో­లీ­సు చర్యల వె­నుక రా­జ­కీయ ఒత్తి­ళ్లు ఉన్నా­య­ని వారు వి­మ­ర్శి­స్తు­న్నా­రు. అయి­తే పో­లీ­సు­లు మా­త్రం విధి ని­ర్వ­హ­ణ­లో ఉన్న సి­బ్బం­ది­పై దాడి జరి­గిం­ద­న్న ఫి­ర్యా­దు మే­ర­కే కేసు నమో­దు చే­శా­మ­ని స్ప­ష్టం చే­స్తు­న్నా­రు. ఇప్ప­టి­కే మాజీ మం­త్రు­లు అం­బ­టి రాం­బా­బు, జోగి రమే­ష్‌­ల­పై నమో­దైన కే­సు­లు రా­జ­కీ­యం­గా పె­ద్ద చర్చ­కు దా­రి­తీ­శా­యి.

Tags:    

Similar News