ఎస్‌ఈసీ కీలక నిర్ణయం...!
మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ వేయకుండా అడ్డుకున్న, బలవంతపు ఉసంహరణ ఘటనలపై ఎస్‌ఈసీ కీలక నిర్ణయం తీసుకుంది..;
Nimmagadda ramesh kumar
మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ వేయకుండా అడ్డుకున్న, బలవంతపు ఉసంహరణ ఘటనలపై ఎస్‌ఈసీ కీలక నిర్ణయం తీసుకుంది.. తిరుపతిలో ఆరుగురు, పుంగనూరులో ముగ్గురు నామినేషన్లు వేసేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం మరో అవకాశం ఇచ్చింది.. తిరుపతిలోని 2, 8, 10, 21, 41, 45 డివిజన్ల అభ్యర్థులకు, అలాగే పుంగనూరు మున్సిపాలిటీలో 9, 14, 28 వార్డు అభ్యర్థులకు మరో ఛాన్స్ ఇచ్చింది. రేపు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటలలోపు నామినేషన్ దాఖలు చేసేందుకు సమయం ఇచ్చింది.. రేపు మధ్యాహ్నం మూడు గంటల తర్వాత నామినేషన్లు పరిశీలిస్తారు.. ఎల్లుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు ఉపసంహరణకు గడువు ఇచ్చారు.