APSRTC : సంక్రాంతి బస్సుల్లో 10% రాయితీ: ఏపీఎస్‌ఆర్‌టీసీ

Update: 2025-01-07 17:00 GMT

సంక్రాంతి రద్దీ దృష్ట్యా 7200 స్పెషల్ బస్సులు నడుపుతున్నట్లు ఏపీఎస్‌ఆర్‌టీసీ ప్రకటించింది. రేపటి నుంచి 13 వరకు 3900 స్పెషల్ బస్సులు, హైదరాబాద్ నుంచి 2,153 బస్సులు, బెంగళూరు నుంచి 375 బస్సులు, తిరుగు ప్రయాణాల కోసం 3200 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు తెలిపింది. ఈ బస్సుల్లో ఎలాంటి అదనపు ఛార్జీలు వసూలు చేయడం లేదని పేర్కొంది. రానూపోనూ టికెట్లు ఒకేసారి బుక్ చేసుకుంటే 10శాతం రాయితీగా ఇస్తామని వెల్లడించింది. రాష్ట్రానికి ప్రయాణికుల్ని చేర్చడమే కాదు.. పండుగ అయిపోయన తర్వాత వారిని తిరిగి వారివారి గమ్య స్థానాల్లో దింపేందుకు సైతం ప్రత్యేక సర్వీసుల్ని ఏర్పాటు చేయగా.. తిరుగు ప్రయాణం కోసం సైతం 3200 ప్రత్యేక బస్స సర్వీసుల్ని కేటాయించినట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. ఈ బస్సుల్లో ఎలాంటి అదనపు ఛార్జీలు వసూలు చేయడం లేదని ఏపీఎస్ఆర్టీసీ ప్రకటించింది. అయితే.. రాయితీ కావాలనుకునే వారు రానుపోను టికెట్లను ఒకేసారి బుక్ చేసుకోవాలని సూచించింది. అలాంటి టికెట్ల ధరలపై 10శాతం రాయితీగా ఇస్తామని వెల్లడించింది.

Tags:    

Similar News