పండగ సీజన్.. ప్రయాణీకులకోసం స్పెషల్ బస్సులు

శుక్రవారం నుంచి ఈ నెల 26 వరకు ప్రయాణీకుల డిమాండ్‌ను బట్టి 1850 బస్సులు ఆయా రూట్లలో తిరగనున్నాయి.

Update: 2020-10-16 07:11 GMT

దసరా పండుగ రద్దీని తట్టుకునేందుకు ప్రయాణీకుల సౌకర్యార్థం ఏపీఎస్ ఆర్టీసీ స్పెషల్ బస్సులు నడుపుతోంది. శుక్రవారం నుంచి ఈ నెల 26 వరకు ప్రయాణీకుల డిమాండ్‌ను బట్టి 1850 బస్సులు ఆయా రూట్లలో తిరగనున్నాయి. ఏపీఎస్‌ ఆర్టీసీ రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు, కర్ణాటకకు కలిపి 5,950 రెగ్యులర్ సర్వీసులను నడుపుతోంది. వీటికి అదనంగా 1850 ప్రత్యేక బస్సులను నడపనుంది. బెంగళూరుకు 562 ప్రత్యేక బస్సులను ఆర్టీసీ అధికారులు తిప్పనున్నారు.

అయితే కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని తమిళనాడులో ఇంకా బస్సు సర్వీసులను అనుమతించనందున ఏపీ బస్సులు ఆ రాష్ట్ర సరిహద్దుల వరకే నడుస్తాయి. సాధారణంగా ప్రతి ఏటా దసరా పండుగకు 2500 పైగా ప్రత్యేక బస్సులను నడుపుతారు. కానీ తెలంగాణతో అంతర్రాష్ట ఒప్పందం కుదరకపోవడంతో ఈ దఫా ప్రత్యేక బస్సుల సంఖ్య తగ్గింది. కాగా తెలంగాణకు ఏపీఎస్ ఆర్టీసీ బస్సులు లేకపోవడంతో ప్రైవేట్ ఆపరేటర్లకు పండగే.

హైదరాబాద్ నుంచి ఏపీలోని అన్ని ప్రాంతాలకు బస్సులు సప్లై చేస్తోంది ప్రవేట్ సర్వీస్ సంస్థ. దీంతో టికెట్ ధరలు కూడా భారీగానే ఉండనున్నట్లు సమాచారం. ఇక ఏపీఎస్ ఆర్టీసీ అందిస్తున్న స్పెషల్ సర్వీసులు.. శ్రీకాకుళం, విజయనగరం-66, విశాఖపట్నం - 128, తూర్పుగోదావరి- 342, పశ్చిమ గోదావరి- 40, కృష్ణా - 176, గుంటూరు-50, ప్రకాశం-68, నెల్లూరు-156, చిత్తూరు-252, అనంతపురం-228, కర్నూలు - 254, కడప-90 స్పెషల్ బస్సులు నడవనున్నాయి. 

Tags:    

Similar News