ఈమధ్య ఏపీలో ఒక కొత్త ట్రెండ్ స్టార్ట్ అయింది. రాష్ట్రంలో ఎక్కడ ఏం జరిగినా సరే దాన్ని కూటమి ప్రభుత్వానికి ఆపాదించేయడం.. లేదంటే సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లపై తోసేసి నిందలు మోపడం వైసిపి బ్యాచ్ కు బాగా అలవాటయింది. ఇప్పుడు తాజాగా వైసీపీ మాజీ నేత దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి పదేపదే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద నిందలు వేస్తూ వస్తున్నారు. వాళ్ల రిలేషన్ గురించి ఏ ఇంటర్వ్యూలో అడిగినా సరే.. దాని గురించి చెప్పకుండా ఏమైనా అంటే పవన్ కళ్యాణ్ చేశాడు మేం చేస్తే తప్పేంటి అంటూ మధ్యలోకి ఆయన్ను తీసుకొస్తున్నారు. వాళ్ల గురించి అడిగితే అది చెప్పకుండా పవన్ కళ్యాణ్ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు. దువ్వాడ శ్రీనివాస్ లాగా భార్యకు విడాకులు ఇవ్వకుండానే ఇంకో భార్యను తెచ్చుకోలేదు కదా. పైగా మాజీ భార్యతో పిల్లల్ని కంటే వారిని విడిచిపెట్టలేదు కదా. అత్యంత బాధ్యతగా రేణు దేశాయ్ తో కన్న పిల్లలను చూసుకుంటున్నారు.
ఇలాంటి వీరిద్దరూ కావాలని పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేయడం ఏంటని జనసైనికులు ఓ రేంజ్ లో గరమవుతున్నారు. మొన్నటికి మొన్న దివ్వెల మాధురి బిగ్ బాస్ షోలోకి వెళ్లి.. గట్టిగట్టిగా అరిచేసి గొడవలు పెట్టుకుంది. ప్రేక్షకులు ఆమెను భరించలేక వెంటనే బయటకు పంపించేశారు. బయటకు వచ్చాక చాలా ఇంటర్వ్యూలు ఇస్తూ.. పిచ్చిపిచ్చి కామెంట్ చేస్తున్నారు. భరణిని ఎలిమినేట్ అయినాక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, నాగబాబు ఒత్తిడి మేరకే తిరిగి బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకొచ్చారంటూ వీళ్లు చెప్పడం మరీ కామెడీగా ఉంది. భరణి తీసుకొస్తే పవన్ కళ్యాణ్ కి వచ్చే లాభమేంటి. పవన్ కళ్యాణ్ ఓ పక్క రాష్ట్ర రాజకీయాలతో పాటు, ప్రభుత్వంలో బాధ్యతలు, ఇంకోపక్క సినిమాలతో చాలా బిజీగా ఉంటున్నారు. కానీ వీళ్లు ఖాళీగా ఉంటున్నారు కదా.. అందుకే పదే పదే పవన్ కళ్యాణ్ మీద కామెంట్లు చేస్తే పబ్లిక్ లో అటెన్షన్ లో ఉంటామని వీళ్ళ ఆరాటం.
పబ్లిక్ నోళ్ళలో నానాలి అంటే ఏదో ఒక మంచి పని చేయాలి. అంతేగాని ఇలాంటి కామెంట్లు చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ కావాలి అనుకోవడం ఏంటి. మాధురి చేష్టలను భరించలేక ప్రేక్షకులు బయటకు పంపిస్తే.. పవన్ కళ్యాణ్ ను మధ్యలోకి లాగడమేంటి. కనీసం మాట్లాడటానికి ఒక అర్థం కూడా ఉండదా. ఇలాంటి వ్యాఖ్యలతో జనాలను మభ్య పెట్టాలని చూస్తున్నారా. వీళ్ళ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి పవన్ కళ్యాణ్ మీద నిందలు వేయడం ఏంటని పవన్ ఫ్యాన్స్ దారుణంగా కామెంట్లు పెడుతూ తిడుతున్నారు.