CM జగన్‌ బెయిల్ రద్దు పిటిషన్‌పై CBI కోర్టులో వాదనలు..

CM జగన్‌ బెయిల్ రద్దు చేయలంటూ దాఖలైన పిటిషన్‌పై CBI కోర్టులో వాదనలు జరిగాయి. జగన్‌ బెయిల్ రద్దు కోరుతూ ఈనెల 15నే ఎంపీ రఘురామకృష్ణరాజు పిటిషన్ వేశారు.

Update: 2021-04-22 08:00 GMT

CM జగన్‌ బెయిల్ రద్దు చేయలంటూ దాఖలైన పిటిషన్‌పై CBI కోర్టులో వాదనలు జరిగాయి. జగన్‌ బెయిల్ రద్దు కోరుతూ ఈనెల 15నే ఎంపీ రఘురామకృష్ణరాజు పిటిషన్ వేశారు. దీన్ని అనుమతించిన కోర్టు ఇవాళ వాదనలు వింది. రఘురామ తరపున సీనియర్‌ అడ్వొకేట్‌ ఆదినారాయణరావు వాదనలు వినిపించారు. ఆస్తుల కేసులో జగన్‌పై 11 ఛార్జ్‌షీట్లు ఉన్నాయని, ప్రతి ఛార్జ్‌షీట్‌లోనూ జగన్ A-1గా ఉన్నారంటూ ఆయన కోర్టుకు దృష్టికి తెచ్చారు. జగన్‌ సాక్ష్యుల్ని ప్రభావితం చేసే అవకాశం ఉందని, జగన్‌పై నమోదైన కేసుల్లో త్వరితగతిన విచారణ పూర్తి చేయాలని ఇప్పటికే పలుమార్లు చెప్పిన రఘురామ.. ఈ విషయంలో కోర్టుకు తమ వాదనలు వినిపించామన్నారు. బెయిల్ ఎందుకు రద్దు చేయాలనే దానిపై చెప్పాల్సింది చెప్పామన్నారు. ఈ పిటిషన్‌ విచారణార్హతపై ఈనెల 27న CBI కోర్టు నిర్ణయం ఎలా ఉంటుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Tags:    

Similar News