ముంబై నటి జెత్వానీ కేసులో చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్న ముగ్గురు ఐపీఎస్లను వెంటనే అరెస్టు చేయాలని మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ గుంటూరులో డిమాండ్ చేశారు. మహిళతో దుర్మార్గంగా వ్యవహరించిన ముగ్గురు ఐపీఎస్లను సస్పెండ్ చేయడాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. ఆ ముగ్గురూ తప్పులను ఒప్పుకుని స్వచ్చందంగా రాజీనామా చేయాలన్నారు. ముగ్గురిని వైసీపీలో చేర్చుకొని జిల్లా అధ్యక్షులుగా చేయాలని.. లేదంటే జగన్ సెక్యూరిటీ అధికారులుగా నియమించుకోవాలంటూ వ్యాఖ్యలు చేశారు. కేంద్రానికి లేఖ రాసి ముగ్గురిని ఐపీఎస్ నుంచి తొలగించేలా చర్యలు తీసుకోవాలని డొక్కా మాణిక్యవర ప్రసాద్ డిమాండ్ చేశారు. ఐపీఎస్ లు ట్రిబ్యునల్ కు వెళ్తామనటం సమర్థనీయం కాదన్నారు