తిరుమల లడ్డూ వివాదంపై ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ( Asaduddin Owaisi ) స్పందించారు… వక్ఫ్‌బోర్డును రద్దు చేసే కుట్ర జరుగుతోందన్న ఆయన తిరుమల లడ్డూ విషయంలో జరుగుతున్న వివాదాన్ని ప్రస్తావించారు. లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని దేశవ్యాప్తంగా రాద్దాంతం జరుగుతోందన్నారు... హిందువుల నమ్మకాన్ని తాము గౌరవిస్తామని... లడ్డూలో అలా జంతువుల కొవ్వు కలవడాన్ని తాము వ్యతిరేకిస్తామన్నారు. అదే సందర్భంగా తమ వక్ఫ్ బోర్డు ఆస్తులను లాక్కునేందుకే కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మండిపడ్డారు.