రాష్ట్రంలో హిందుత్వంపై దాడులు ఆలయాలకే పరిమితం కాలేదు : అశోకగజపతిరాజు

ఆంధ్రప్రదేశ్‌లో హిందూమతంపై దాడులు ఆలయాలకే పరిమితం కాలేదని, శాసనపరంగా, పరిపాలన పరంగా కూడా జరుగుతున్నాయని మాజీ మంత్రి అశోకగజపతిరాజు విమర్శించారు

Update: 2021-01-05 16:00 GMT

ఆంధ్రప్రదేశ్‌లో హిందూమతంపై దాడులు ఆలయాలకే పరిమితం కాలేదని, శాసనపరంగా, పరిపాలన పరంగా కూడా జరుగుతున్నాయని మాజీ మంత్రి అశోకగజపతిరాజు విమర్శించారు. ధర్మాన్ని నిర్వీర్యం చేసే కుట్రలను ఎదుర్కొనేందుకు అందరూ కలసిరావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని 8 ప్రధాన ఆలయాల పైన విచారణ కోసం తీసుకొచ్చిన బిల్లును రద్దు చేయమన్నా వినిపించుకోలేదన్నారు. అసలు ఎవరిని ఏ పదవుల్లో నియమిస్తున్నారో తెలియడం లేదన్నారు. దేవుడిపై నమ్మకం లేనివారిని దైవసేవ చేయమంటే ఫలితం ఉంటుందా అని ప్రశ్నించారు. జైల్లో ఉన్న వ్యక్తులను, బెయిల్‌పై విడుదలై వచ్చిన వ్యక్తులను కమిటీలకు ఛైర్మన్‌గా వేస్తున్నారని అశోక గజపతిరాజు మండిపడ్డారు.

Tags:    

Similar News