Atchannaidu : సీఎం జగన్‌ డైవర్షన్ పాలిటిక్స్‌కు తెరలేపారు: అచ్చెన్నాయుడు

Atchannaidu : ఏపీలో జగన్ అసమర్థ పాలనపై దృష్టిమరల్చేందుకే...డైవర్షన్ పాలిటిక్స్‌కు తెరలేపారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు మండిపడ్డారు.

Update: 2022-05-10 15:15 GMT

Atchannaidu : ఏపీలో జగన్ అసమర్థ పాలనపై దృష్టిమరల్చేందుకే...డైవర్షన్ పాలిటిక్స్‌కు తెరలేపారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. మాజీ మంత్రి నారాయణ అక్రమ అరెస్టునుఖండించిన అచ్చెన్నాయుడు...ఎలాంటి నోటీసులు లేకుండా మాజీ మంత్రి పట్ల ఇష్టానుసారంగా వ్యవహరించారన్నారు. ప్రశ్నాపత్నాల లీకేజీ ఎక్కడా జరగలేదని స్వయంగా విద్యాశాఖ మంత్రి చెబుతుంటే.. నారాయణను ఏవిధంగా అరెస్ట్ చేస్తారని ప్రశ్నించారు. రాజకీయ కుట్రలో భాగంగానే నారాయణను అరెస్ట్ చేశారని అన్నారు. పోలీసులు వైసీపీ చేతుల్లో కీలు బొమ్మల్లా మారారని స్పష్టమైందన్నారు అచ్చెన్నాయుడు.

Tags:    

Similar News