Atchannaidu: 'ధైర్యముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి..' రోజాకు అచ్చెన్నాయుడు కౌంటర్
Atchannaidu: వైసీపీ ఎమ్మెల్యే రోజా కామెంట్స్‌కు టీడీపీ ఏపీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు అదే రేంజ్‌లో రివర్స్ అటాక్ ఇచ్చారు;
Atchannaidu: వైసీపీ ఎమ్మెల్యే రోజా కామెంట్స్‌కు టీడీపీ ఏపీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు అదే రేంజ్‌లో రివర్స్ అటాక్ ఇచ్చారు. రోజాకు ధైర్యముంటే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎన్నికలకు సిద్ధపడాలని.. నగరిలో మేం ఓడిపోతే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోమని అచ్చెన్నాయుడు సవాల్ విసిరారు. వైసీపీ మహిళా నాయకురాలు ఏదేదో కామెంట్లు చేస్తున్నారని తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు. చంద్రబాబు, అచ్చెన్నాయుడు తలకిందులు తపస్సు చేసినా 160 సీట్లు కాదుకదా, ఆ సంఖ్య ఓట్లు కూడా పడవని రోజా అంతకుముందు కామెంట్ చేశారు.