AU: శాంతించిన ఏయూ విద్యార్థులు..ఆందోళన విరమణ
విద్యార్థి మృతిపై భగ్గుమన్న ఏయూ.. రెండు రోజులుగా విద్యార్థుల ఆందోళన... వీసీ రాజీనామాకు విద్యార్థుల పట్టు
విద్యార్థి మృతితో రెండు రోజులుగా రణరంగంగా మారిన ఆంధ్రా యూనివర్సిటీలో ప్రస్తుతం ప్రశాంతంగా మారింది. విద్యార్థి సంఘాలు, ఏయూ వైస్ ఛానల్సర్ రాజశేఖర్ తో జరిగిన చర్చలు ఫలించాయి. తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఏయూ వర్సిటీ ఎదుట విద్యార్థులు ఆందోళన నిర్వహించారు. . ఆ సమయంలో వీసీ రాజశేఖర్ అక్కడికి వచ్చిన వీసీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఏయూ శాతవాహన హాస్టల్ విద్యార్థి మణికంఠ మృతికి వర్సిటీ డిస్పెన్సరీలో సరైన సౌకర్యాలు లేకపోవడమేనని నినాదాలు చేశారు. దీంతో వారిని పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
వర్సిటీలో చాలా సమస్యలు ఉన్నాయని, ఇప్పటికైనా పరిష్కరించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. చివరకు ఈ విషయంపై అటు ప్రభుత్వం కూడా స్పందించింది. విద్యార్థి మృతిపై రాజకీయం చేయొద్దని సూచించింది. విద్యార్థులతో తాము చర్చలకు రెడీ అని తెలిపింది. మరోవైపు వీసీ రాజశేఖర్ సైతం విద్యార్థులతో చర్చలు జరిపారు. రెండు రోజుల్లో సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. దీంతో విద్యార్థులు శాంతించారు. ఆందోళనను విరమించారు. విద్యార్థుల హామీలు నెరవేరుస్తామని హామీ ఇచ్చారు.
ఆంధ్రా యూనివర్సిటీలో కనీస వైద్య సదుపాయాలు, ఆక్సిజన్ కల్పించక పోవడం వల్లే బీఎడ్ విద్యార్థి మణికంఠ మృతి చెందాడని తీవ్ర ఆగ్రహ జ్వలలు వెల్లు వెత్తాయి. స్టూడెంట్ మృతికి బాధ్యత వహిస్తూ వీసి రాజీనామా చేయాలనీ విద్యార్థులంతా డిమాండ్ చేశారు.. పరిస్థితులు చేయి దాటి పోవడంతో భారీగా పోలీసులు మొహరించారు.. అయినప్పటికీ విద్యార్థులు ఆందోళనలో వెనక్కి తగ్గలేదు.. వీసీ ఛాంబర్ ను ముట్టడించి న్యాయం కోసం డిమాండ్ చేశారు. దీంతో ఆంధ్ర యూనివర్సిటీ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. మరోవైపు, అసెంబ్లీలో ఏయూ ఇష్యూపై స్పందించిన మంత్రి నారా లోకేష్.. నిన్న ఆంధ్రా యూనివర్సిటీలో ఒక విద్యార్ధి ఫిట్స్ వచ్చి చనిపోయారని తెలిపారు.. అయితే, అంబులెన్స్ లో తీసుకెళ్లినా కాపాడలేకపోయాం అన్నారు.