AYESHA MEERA: ఆయేషా మీరా కేసు క్లోజ్..! ముగిసిన 17 ఏళ్ల పోరాటం
ముగిసిన ఆయేషా మీరా హత్య కేసు విచారణ... 17 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత కేసు క్లోజ్... కీలక ఆదేశాలు ఇచ్చిన సీబీఐ కోర్టు.. ఈ నెల 27న అవశేషాలకు అంత్యక్రియలు
పెను సంచలనం సృష్టించిన బీ ఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా హత్య కేసు అధికారికంగా ముగిసింది. సుమారు 17 ఏళ్ల పాటు ఎన్నో మలుపులు తిరిగిన ఈ కేసులో అసలు దోషి ఎవరో తేల్చలేక సీబీఐ చేతులెత్తేయడంతో న్యాయస్థానం ఈ కేసును మూసివేస్తూ సంచలనం నిర్ణయం తీసుకుంది. విజయవాడలోని సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయాధికారి అన్నపూర్ణ ఈ మేరకు శుక్రవారం తుది ఉత్తర్వులు జారీ చేశారు. సీబీఐ సమర్పించిన క్లోజ్ రిపోర్ట్‌ను పరిశీలించిన విజయవాడ సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి అన్నపూర్ణ కేసును అధికారికంగా మూసివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దోషి తేలకుండానే కేసు ముగియడం బాధాకరమని అనేక వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
ఇక మరోవైపు, రీ-పోస్టుమార్టం కోసం వెలికితీసిన తమ కుమార్తె అవశేషాలను తమకు అప్పగించాలని ఆయేషా తల్లిదండ్రులు పిటిషన్ దాఖలు చేశారు. తమకు న్యాయం దక్కకపోయినా, కనీసం మతాచారాల ప్రకారం అంత్యక్రియలు నిర్వహించుకోవాలన్నది వారి విన్నపం. దీనిపై స్పందించిన సీబీఐ కోర్టు ఈ నెల 27న ఉదయం 10 గంటలకు అవశేషాలను అధికారికంగా అప్పగించాలని ఆదేశించింది. గుర్తింపు పంచనామా నిర్వహించిన అనంతరం భద్రతా ఏర్పాట్ల మధ్య ప్రభుత్వ వాహనంలో అవశేషాలను తెనాలికి తరలించి, ముస్లిం మతాచారాల ప్రకారం గౌరవప్రదంగా అంత్యక్రియలు నిర్వహించేందుకు అనుమతి ఇచ్చింది. మొత్తం ప్రక్రియను వీడియో రికార్డు చేసి నివేదికను కోర్టుకు సమర్పించాలని కూడా స్పష్టం చేసింది.
ఆయేషా తల్లి శంషాద్ బేగం ఏళ్ల తరబడి న్యాయం కోసం పోరాడారు. అయితే సీబీఐ కూడా నిందితులను గుర్తించలేకపోవడంతో తీవ్ర నిరాశకు లోనయ్యారు. సీబీఐ క్లోజ్ రిపోర్ట్‌పై తాము ఎలాంటి ప్రొటెస్ట్ పిటిషన్ గానీ, ప్రైవేట్ కేసు గానీ వేయబోమని కోర్టుకు స్పష్టం చేశారు. దీంతో దాదాపు రెండు దశాబ్దాలుగా సాగిన ఈ కేసు అధికారికంగా ముగిసింది. రీ పోస్టుమార్టం కోసం తీసుకున్న ఆయేషా శరీర అవశేషాలను తిరిగి తమకు అప్పగించాలని ఆమె తల్లిదండ్రులు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై స్పందించిన కోర్టు, ఈ నెల 27 తేదీని ఉదయం 10 గంటలకు అప్పగించాలని ఆదేశించింది. న్యాయస్థానంలో గుర్తింపు పంచనామా నిర్వహించిన తర్వాతే అవశేషాలను అప్పగించాలని పేర్కొంది. తగిన భద్రతతో ప్రభుత్వ వాహనంలో అవశేషాలను స్వస్థలమైన తెనాలికి తరలించారని పేర్కొంది. అక్కడ వారి మతాచారం ప్రకారం గౌర ప్రదంగా అంత్యక్రియలు నిర్వహించేలా అధికారులు సహకరించాలని సూచించింది. మొత్తం ప్రక్రియను వీడియో చిత్రీకరించాలని పేర్కొంది. ఆయేషా మీరా హత్య కేసు అనేక దర్యాప్తు సంస్థలు మారినా, అనేక విచారణలు జరిగినా, అసలు నేరస్థుడు ఎవరో తేలకుండానే ముగియడం న్యాయవ్యవస్థపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఆమెకు మతాచారాల ప్రకారం అంతిమ వీడ్కోలు లభించనుంది.