పాపం జగన్ మోహన్ రెడ్డికి అధికారం పోయినప్పటి నుంచి కనీసం ఆధారాలు కూడా లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఎవరో రాసిచ్చిన స్క్రిప్టును ఫాలో అయిపోయి తన పరువు తానే పోగొట్టుకుంటున్నారని కూటమి నేతుల అంటున్నారు. కనీసం అది నిజమో కాదో కూడా చెక్ చేసుకోవట్లేదు. చాలాకాలం తర్వాత నిన్న ఏపీకి వచ్చి మూడు గంటల పాటు మాట్లాడిన వైఎస్ జగన్.. ఎన్ని అబద్దాలు చెప్పాలో అన్నీ చెప్పేశారు. సీఎం చంద్రబాబుకు ప్రత్యేక విమనాం, హెలికాప్టర్ అని.. మంత్రి నారా లోకేష్ కు స్పెషల్ ఫ్లైట్ అన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు కూడా స్పెషల్ ఫ్లైట్ ఉందని.. ఇవన్నీ ప్రజల సొమ్ముతోనే తీసుకుని ఎంజాయ్ చేస్తున్నారంటూ మాట్లాడారు. మంత్రి నారా లోకేష్ కొలంబోకు ప్రభుత్వ సొమ్ముతోనే స్పెషల్ ఫ్లైట్ లో వెళ్లారని.. తెల్లారే సరికి మళ్లీ స్పెషల్ ఫ్లైట్ లో తిరిగి వచ్చారని.. ఇలా ప్రజల సొమ్ముతో విచ్చలవిడిగా ఎంజాయ్ చేస్తున్నారంటూ చెప్పారు.
మాజీ సీఎం జగన్ వ్యాఖ్యలపై మంత్రి లోకేష్ స్పందించారు. తాను ప్రభుత్వ సొమ్ముతో వెళ్లలేదని క్లారిటీ ఇచ్చారు. తన సొంత డబ్బులతోనే ఫ్యామిలీని తీసుకుని వెళ్లానని.. అందుకు పూర్తి ఖర్చు తానే పెట్టుకున్నట్టు వెల్లడించారు. జగన్ అధికారంలో ఉన్నప్పుడు పక్క జిల్లాకు వెళ్లాలన్నా స్పెషల్ ఫ్లైట్, హెలికాప్టర్ వాడారని.. కానీ తాము ప్రజల సొమ్మును అలా వృథా కాకుండా కాపాడుతున్నామని చెప్పారు. సొంత డబ్బుతోనే తమ ఖర్చులు పెట్టుకుంటున్నట్టు చెప్పారు.
కూటమి ప్రభుత్వంలో అందరూ ఎక్కువగా కార్లనే వాడుతున్నామని.. ప్రభుత్వ సొమ్మును జగన్ లాగా దుర్వినియోగం చేయట్లేదని చెప్పుకొచ్చారు మంత్రి లోకేస్. దెబ్బకు మాజీ సీఎం జగన్ పరువు పోయినట్టు అయింది. ఈ స్టేట్ మెంట్ తో వైసీపీ బ్యాచ్ నుంచి నోట మాట రావట్లేదు. అందరూ సైలెంట్ అయిపోయారు. ఇలాంటి కామెంట్ల వల్ల జగన్ తన పరువు తానే తీసుకుంటున్నారని కూటమి నేతలు చెబుతున్నారు.