Badvel Byelections: పోలింగ్ కేంద్రాల్లో చెప్పులతో దాడి..
Badvel Byelections: బద్వేలు ఉప ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 11 గంటల వరకు 23 శాతం పోలింగ్ నమోదైంది.;
Badvel Byelections: బద్వేలు ఉప ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 11 గంటల వరకు 23 శాతం పోలింగ్ నమోదైంది. మరోవైపు కొన్నిచోట్ల ఉద్రిక్త పరిస్ధితులు కనిపించాయి. అట్లూరు మండలం ఎస్ వెంకటాపురంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. బయట నుంచి వచ్చిన వ్యక్తి ఓటు వేయడానికి ప్రయత్నించగా.. మరోవర్గం వాళ్లు అడ్డుకున్నారు. ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు చెప్పులతో దాడి చేసుకున్నారు. దీంతో గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు.
మరోవైపు బద్వేలు నియోజకవర్గ పరిధిలోని పలు ప్రాంతాల్లో బీజేపీ ఏజెంట్లను ఇబ్బందులు పెడుతున్నారని ఎంపీ సీఎం రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఎన్నికలో పోలీసులు, దొంగలు ఒకటయ్యారని విమర్శించిన సీఎం రమేష్.. పోలింగ్ బూత్ వద్ద కేంద్ర బలగాలు లేరని, స్థానిక పోలీసులే ఉంటున్నారని అన్నారు. ఇక పోరుమామిళ్లలో బయట నుంచి వ్యక్తులను తీసుకొచ్చారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.