ఎంపీ రఘురామకృష్ణరాజుకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు..!
ఎంపీ రఘురామకృష్ణరాజుకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇరువైపుల వాదనలు విన్న తర్వాత ఆదేశాలు జారీ చేసింది.;
ఎంపీ రఘురామకృష్ణరాజుకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇరువైపుల వాదనలు విన్న తర్వాత ఆదేశాలు జారీ చేసిన సుప్రీంకోర్టు.. విచారణకు 24 గంటల ముందే సీఐడీ నోటీసులివ్వాలని పేర్కొంది. న్యాయవాది సమక్షంలోనే విచారించాలని సూచించింది. విచారణకు సహకరించాలని రఘురామను ఆదేశించింది. రఘురామ సోషల్ మీడియా, మీడియా ముందుకు రాకూడదని, ఎలాంటి ప్రెస్ మీట్లు పెట్టరాదని తెలిపింది.