Kothapalli Geetha : మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన కొత్తపల్లి గీతకు బెయిల్ మంజూరు..

Kothapalli Geetha : అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీత దంపతులకు బెయిల్ మంజూరైంది;

Update: 2022-09-16 12:15 GMT

Kothapalli Geetha : అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీత దంపతులకు బెయిల్ మంజూరైంది. 25 వేల వ్యక్తిగత పూచికత్తు సమర్పించాలని గీత దంపతులను హైకోర్టు ఆదేశించింది. బ్యాంకును మోసం చేశారన్న కేసులో కొత్తపల్లి గీత దంపతులకు సీబీఐ కోర్టు ఐదేళ్లు జైలు శిక్ష విధించింది. సీబీఐ కోర్టు తీర్పును హైకోర్టులో గీత దంపతులు సవాల్ చేశారు. విచారణ చేపట్టిన హైకోర్టు సీబీఐ కోర్టు తీర్పు అమలును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణ డిసెంబర్ 16కు వాయిదా వేసింది.

Tags:    

Similar News