AP: ఆంధ్రప్రదేశ్‌కు ఎయిర్ బస్‌..!

తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం;

Update: 2025-01-19 06:43 GMT

ఆంధ్రప్రదేశ్‌కు మరో దిగ్గజ కంపెనీ రానున్నట్లు తెలుస్తోంది. విమానాల తయారీలో ప్రపంచవ్యాప్తంగా పేరున్న ఎయిర్ బస్ మన దేశంలో హెలికాఫ్టర్ల తయారీ ప్లాంట్ ను పెట్టాలని నిర్ణయించుకుంది. ఇందులో నాలుగు ప్రదేశాలను షార్ట్‌లిస్ట్ చేసినట్లుగా పారిశ్రామిక వర్గాలు చెబుతున్నాయి. టాటా అడ్వాన్సెడ్ సిస్టమ్స్ లిమిటెడ్‌తో భాగస్వామ్యంతో H125 హెలికాప్టర్ల ఉత్పత్తి ప్లాంట్ ను ఏర్పాటుచేయనుంది. ఇప్పటివరకూ ఇలాంటి హెలికాఫ్టర్ల తయారీ పరిశ్రమలను మూడు వివిధ దేశాలలో ఏర్పాటు చేసింది. నాలుగోది ఇండియాలో ఏర్పాటు చేయాలని డిసైడ్ అయింది. మేక్-ఇన్-ఇండియా లో భాగంగా టాటాలతో కలిసి ఈ ప్లాంట్ నిర్మింంచనున్నారు. ఉత్తరప్రదేశ్, గుజరాత్, ఆంధ్రప్రదేశ్ , కర్ణాటకలలో స్థల పరిశీలన చేశారు.

రాయలసీమలో...

రాయలసీమలో తయారీ రంగానికి అనువైన వాతావరణం ఉందని ఏపీ ప్రభుత్వం ప్రమోట్ చేస్తోంది. కియా పరిశ్రమ ఎంత వేగంగా పూర్తయిందో.. ఉత్పత్తి ప్రారంభమయిందో ఓ కేస్ స్టడీగా చూపిస్తున్నారు. విద్యుత్, నీరు , భూమి వంటి మౌలిక సదుపాయాలతో పాటు ట్రాన్స్ పోర్టుకు అవసరమైన అన్ని సౌకర్యాలు ఏపీకి ఉన్నాయని చెబుతున్నారు. ఈ ప్లాంట్ కోసం పోటీ పడుతున్న మిగతా మూడు రాష్ట్రాలు పారిశ్రామిక పరంగా అభివృద్ది చెందినవే. ఏపీ కొత్త రాష్ట్రం కావడంతో పారిశ్రామికంగా అభివృద్ధి చెందేందుకు ప్రోత్సాహకాలు భారీగా ఇస్తోంది. ఈ క్రమంలో అవకాశాల్ని అందిపుచ్చుకునేందుకు ఎయిర్ బస్ సంస్థ కూడా ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాి.

సింగిల్ ఇంజన్ హెలికాప్టర్..

సింగిల్-ఇంజన్ హెలికాప్టర్‌ను ఎక్కడ అసెంబుల్ చేస్తారనే దానిపై త్వరలో ప్రకటన వెలువడే అవకాశం ఉంది. వచ్చే ఏడాదిలోనే నుంచి H125ని తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా తెలుస్తోంది. ఉద్యోగులకు, రవాణాకు మెరుగైన ప్రాంతాన్ని ఎంపిక చేసుకోనున్నారు. దేశంలో ప్రైవేట్ రంగంలో సివిల్ హెలికాప్టర్ తయారీ ప్లాంట్ ఇదే అవతుుందని ఇండస్ట్రీర వర్గాలు చెబుతున్నాయి. రాబోయే 20 సంవత్సరాలలో దేశంతో పాటు  దక్షిణాసియాలో H125 తరగతికి చెందిన హెలికాప్టర్లకు డిమాండ్ ఉంటుందని ఎయిర్‌బస్ హె అంచనా వేస్తోంది.

Tags:    

Similar News