Bonda Uma : మంత్రి కొడాలి నానికి బొండా ఉమ సవాల్
Bonda Uma : మంత్రి కొడాలి నాని సవాల్‌కు ప్రతి సవాల్ విసిరారు టీడీపీ నేత బొండా ఉమ.;
Bonda Uma : మంత్రి కొడాలి నాని సవాల్‌కు ప్రతి సవాల్ విసిరారు టీడీపీ నేత బొండా ఉమ. కొడాలి నాని సవాల్‌కు సై అన్న ఆయన.. కె కన్వెన్షన్‌లో క్యాసినో జరిగిందని నిరూపించడానికి తాము సిద్ధమన్నారు. నిరూపించలేక పోతే తాను పెట్రోల్ పోసుకోవడానికి సిద్ధమన్న బొండా.. నిరూపిస్తే పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటారా.? అని మంత్రి కొడాలి నానికి సవాల్ విసిరారు. కొడాలి నానికి డబ్బు పిచ్చి పట్టి.. సంప్రదాయ పండుగల్లో అశ్లీన నృత్యాలు చేయించారని బొండా మండిపడ్డారు. నిజనిర్ధారణకు టీడీపీ సిద్ధపడటంతో ప్రభుత్వంలో కంగారు మొదలైందన్న బొండా.. క్యాబినెట్‌లో ఏం జరిగిందో ఏమో కానీ.. కొడాలి ప్రస్టేషన్‌లో మాట్లాడుతున్నారని విమర్శించారు.