BUS ACCIDENT: కర్నూలు బస్సు ప్రమాదం.. డీఎన్‌ఏ పరీక్షలు పూర్తి
19 మృతదేహాలను గుర్తించిన వైద్యులు.. 18 మృతదేహాల అప్పగింత పూర్తి
కర్నూలు జిల్లాలో రెండు రోజుల కింద జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో సజీవ దహనమైన ప్రయాణికుల మృతదేహాలను కుటుంబసభ్యులకు అప్పగించారు. ఒక మృతదేహం మినహా మిగతా డెడ్‌బాడీస్‌ను డీఎన్ఏ టెస్టుల అనంతరం వారి కుటుంబసభ్యులకు అప్పగింత ప్రక్రియ పూర్తయింది. ఈ మేరకు అధికారులు తీసుకున్న చర్యలు, తుది నివేదిక వివరాలను కర్నూలు జిల్లా కలెక్టర్, ఎస్పీ వెల్లడించారు. మరణ ధ్రువీకరణ పత్రాలను కూడా వారికి అందించారు. ఈ ప్రక్రియను జిల్లా కలెక్టర్ ఎ.సిరి పర్యవేక్షించారు. మృతదేహాలను స్వస్థలాలకు చేర్చేందుకు అంబులెన్స్‌లు ఏర్పాటు చేశారు.
18 మృతదేహాల అప్పగింత
వేమూరి కావేరి ట్రావెల్స్ ప్రమాదంలో చనిపోయిన వారి మృతదేహాలు తీవ్రంగా కాలిపోవడంతో, వాటిని గుర్తించడం కష్టమైంది. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం మృతదేహాలకు, వారి కటుుంబసభ్యులకు డీఎన్ఏ టెస్టులు నిర్వహించింది. ఆ నివేదిక ఆధారంగా గుర్తించిన 18 మంది మృతదేహాలను అధికారులు వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ మొత్తం ప్రక్రియను జిల్లా కలెక్టర్ ఎ. సిరి స్వయంగా పర్యవేక్షించారు. మరణ ధ్రువీకరణ పత్రాలను కూడా కుటుంబాలకు అందించారు. ఆ మృతదేహాలను వారి స్వస్థలాలకు చేర్చేందుకు అవసరమైన అంబులెన్స్‌లను అధికారులు ఏర్పాటు చేశారు.
19వ మృతదేహం గుర్తింపు
కర్నూలు జిల్లా బస్సు దగ్ధం ఘటనలో 19 మంది సజీవ దహనమైన విషయం తెలిసిందే. మొత్తం 19 మంది మృతదేహాలకు డీఎన్ఏ పరీక్షలు పూర్తి అయ్యాయి. 18 మంది మృతదేహాలను బంధువులకు అప్పగించారు. అయితే 19వ మృతదేహం చిత్తూరు జిల్లాకు చెందిన త్రిమూర్తిగా డీఎన్ఏ పరీక్షలో నిర్ధారణ అయింది. కాసేపట్లో మృతదేహాన్ని బంధువులకు అప్పగించనున్నారు. బైక్, బస్సు ప్రమాదం వేర్వేరుగా జరిగినట్లు పోలీసులు ఇప్పటికే గుర్తించారు. అయితే బైక్ ప్రమాదంలో చనిపోయిన శివశంకర్ ప్రమాదానికి ముందు మద్యం సేవించినట్లు తేలింది. స్నేహితుడు ఎర్రిస్వామితో కలిసి మద్యం కొంటున్న విజువల్స్ తాజాగా వెలుగులోకి వచ్చాయి. దీంతో బైకర్ శివశంకర్ ప్రమాదానికి గురవడానికి మద్యం మత్తే కారణంగా తేలింది.