Nellore : నెల్లూరు బస్టాండ్ లో బస్సు చోరీ

Update: 2025-07-23 11:00 GMT

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు డిపోకు చెందిన బస్సు శనివారం ఏఎస్పేట నుంచి నెల్లూరు వెళ్ళింది. రాత్రి పీఎస్ఆర్ బస్టాండ్లో హాల్ట్ చేశారు. బుధవారం ఉదయం ఎ.ఎస్ పేటకు వెళ్లాల్సి ఉంది. అయితే మంగళవారం రాత్రి బస్టాండ్ లో ఉన్న బస్సును తెల్లవారుజామున మూడు గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తి స్టార్ట్ చేసుకొని అక్కడ్నుంచి బుచ్చి, సంగం మీదుగా ఆత్మకూరు వైపు వెళ్ళాడు. నాలుగు గంటలకు నిద్రలేచిన కండక్టర్ డ్రైవర్ బస్టాండ్ లో పార్కు చేసి ఉన్న కలిగిరి బస్సు వద్దకు వెళ్ళగా అక్కడ బస్సు కనిపించలేదు. చుట్టుపక్కల వెతికారు. బస్సు ఆచూకీ తెలియకపోవడంతో అక్కడున్న టు డిపో సిబ్బందిని అడిగారు. వాళ్లు సైతం తెలియదని చెప్పడంతో ఆత్మకూరు డిపోకు సమాచారం అందించారు. దాంతో అలర్ట్ అయిన డిపో అధికారులు సిబ్బందికి బస్సు చోరీ విషయం గురించి సమాచారం ఇచ్చారు. నెల్లూరు పాలెం వద్ద కొందరు సిబ్బంది నాలుగు గంటల సమయంలో ఆ మార్గంలో బస్సు రావచ్చని కాపు కాశారు. నాలుగున్నర గంటల సమయంలో నెల్లూరు పాలెం కు చోరీకి గురైన బస్సు వచ్చింది. దాంతో బస్సును చాక చెక్యంగా ఆపి డ్రైవర్ సీట్ లో ఉన్న వ్యక్తిని పట్టుకున్నారు. అదుపులోకి తీసుకొని ఆత్మకూరు పోలీసులకు అప్పగించారు. బస్సు ఎత్తుకెళ్లిన వ్యక్తి విడవలూరుకు చెందిన కృష్ణగా గుర్తించారు ఇతని మతిస్థిమితం సరిగలేదని తెలిసింది.. పోలీసులు పూర్తి వివరాలు తెలుసుకుంటున్నారు.. బస్సు దొరకడంతో ఆర్టీసీ సిబ్బంది అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా బస్టాండ్ లో జనసంచారం ప్రయాణికులు ఉండే సమయంలో ఒక వ్యక్తి బస్సులు చోరీ చేసి తీసుకువెళ్లడం సంచలనం కలిగిస్తోంది. బస్టాండ్ లో ఎప్పుడు ఆర్టీసీ అధికారులు సిబ్బంది డ్యూటీలో ఉంటారు. అందరూ ఉన్న బస్సును అక్కడి నుంచి దొంగ తీసుకెళ్లడం ఆ బస్సు ఆత్మకూరు వెళ్లే వరకు గుర్తించలేకపోవడం భద్రత వైఫల్యాలు కనిపిస్తున్నాయని పలువురు అంటున్నారు.

Full View

Tags:    

Similar News