Andhra Pradesh: 2024 ఎన్నికల నాటికి స్టార్ హోటళ్లలో తప్ప మద్యం బాటిళ్లు కనిపించకుండా చేస్తాం: సీఎం జగన్

Andhra Pradesh: 2024 ఎన్నికల నాటికి స్టార్ హోటళ్లలో తప్ప మద్యం బాటిళ్లే కనిపించకుండా చేస్తానన్నారు సీఎం జగన్. ఎన్నికలకు మరో ఏడాదిన్నరే ఉన్నా.. ఇంకా కొత్త కొత్త బ్రాండ్లు ప్రవేశపెడుతున్నారు.

Update: 2022-11-16 06:19 GMT

Andhra Pradesh: 2024 ఎన్నికల నాటికి స్టార్ హోటళ్లలో తప్ప మద్యం బాటిళ్లే కనిపించకుండా చేస్తానన్నారు సీఎం జగన్. ఎన్నికలకు మరో ఏడాదిన్నరే ఉన్నా.. ఇంకా కొత్త కొత్త బ్రాండ్లు ప్రవేశపెడుతున్నారు. కొత్తగా ఏపీలో పది మద్య బ్రాండ్లకు అనుమతి ఇచ్చారు.


ఎన్నికలప్పుడు విపక్షనేతగా జగన్‌ ఇచ్చిన హామీ ప్రకారం.. ఒక్కో బ్రాండ్ కనిపించకుండా పోవాలి. ఒక్కో వైన్‌ షాప్‌ మూతపడుతూ ఉండాలి. మద్యంపై వచ్చే ఆదాయం నెలనెలా తగ్గాలి. కాని, ఇప్పటికీ కొత్త బ్రాండ్లు రిలీజ్ చేస్తున్నారంటే ఏమనుకోవాలి? మద్యనిషేధం హామీపై సీఎం జగన్‌ మాట తప్పారు, మడమ తిప్పారు అనే చెప్పాల్సి ఉంటుంది.


నవరత్నాల్లో మద్య నిషేధం అంటూ ఇచ్చిన హామీని మద్య నియంత్రణగా మార్చే కుట్ర జరుగుతోంది. వచ్చే ఎన్నికల ప్రచారంలో మద్య నిషేధం కాదు.. మద్య నియంత్రణ అని చెప్పినా చెప్పొచ్చు జగన్ సర్కార్.

ఎన్నికలకు 16 నెలలు మాత్రమే ఉందని పదేపదే గుర్తు చేస్తున్న ఏపీ ముఖ్యమంత్రికి.. ఎన్నికల నాటికి సంపూర్ణ మద్యనిషేధం అమలు చేస్తానని ఇచ్చిన హమీ గుర్తుకు రావడం లేదు. రాష్ట్రంలో మద్యం వినియోగం చాలా వరకు తగ్గిందని స్వయంగా సీఎం జగనే చెబుతున్నా.. దాని మీద వచ్చే ఆదాయం ఏ మాత్రం తగ్గిందో చెప్పడం లేదు. దశలవారీగా మద్యనిషేధం అమలు చేస్తామంటూ ప్రకటించిన సీఎం జగన్.. అందుకు పూర్తి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు.

ఉన్న బ్రాండ్లు సరిపోవన్నట్లుగా ఏపీలో కొత్తగా మరో 10 బ్రాండ్లకు అనుమతులు ఇచ్చారు. మిగతా బ్రాండ్ల కంటే ఎక్కువ ధరకు అమ్ముకునేందుకు వీటికి అవకాశం కల్పించారు. అయితే, ప్రస్తుతం అమ్ముతున్న మద్యాన్నే.. అవే కంపెనీలు రేటు పెంచుకునేందుకు కొత్త బ్రాండ్ల రూపంలో తెరపైకి తీసుకొచ్చి అనుమతులు పొందాయన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.


తమిళనాడుకు చెందిన SNJ షుగర్స్‌ అండ్‌ ప్రొడక్ట్‌ లిమిటెడ్‌ సంస్థతోపాటు మరికొన్ని మద్యం సరఫరా కంపెనీల కొత్త బ్రాండ్లకు అనుమతిచ్చారు. ఈ పది బ్రాండ్లే కాదు.. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పదుల సంఖ్యలో కొత్త బ్రాండ్లకు అనుమతులు వచ్చాయి. ప్రస్తుతం ఏపీలో 300కు పైగా బ్రాండ్లు APSBCL వద్ద నమోదై ఉన్నాయి.


ఇవి చాలవన్నట్లు ఇప్పుడు మరో 10 బ్రాండ్లకు అనుమతివ్వడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దొడ్డిదారిలో మద్యం ధరలు పెంచుకునేందుకు, మందుబాబులను దోపిడీ చేయటానికే ఈ బ్రాండ్లకు అనుమతులిచ్చారన్న విమర్శలున్నాయి.

Tags:    

Similar News