BY ELECTIONS: వైఎస్ కంచుకోటలో ఉప ఎన్నికలు ప్రారంభం

పులివెందుల, ఒంటిమిట్టల్లో ఉప ఎన్నిక, జడ్పీటీసీ ఉప ఎన్నిక కోసం సర్వం సిద్ధం, ఉదయం 9 నుంచి 5 గంటల వరకు పోలింగ్;

Update: 2025-08-12 04:00 GMT

ఆం­ధ్ర­ప్ర­దే­శ్‌­లో­ని రా­జ­కీయ పా­ర్టీ­లు అత్యంత ప్ర­తి­ష్టా­త్మ­కం­గా తీ­సు­కు­న్న పు­లి­వెం­దుల, ఒంటి మి­ట్ట జడ్పీ­టీ­సీ స్థా­నా­ల్లో ఉపఎ­న్ని­క­ల­కు పో­లిం­గ్ ఆరంభమైంది. రెం­డు మం­డ­లా­ల్లో పో­లిం­గ్  ఉదయం  7 గంటల నుం­చి సా­యం­త్రం 5 గంటల వరకు జరు­గు­తోం­ది. పో­లిం­గ్ సా­మా­గ్రి­ని పం­పి­ణీ చే­శా­రు. సి­బ్బం­ది పో­లిం­గ్ కేం­ద్రా­లు­కు చే­రు­కు­న్నా­రు. పు­లి­వెం­దుల, ఒం­టి­మి­ట్ట జడ్పీ­టీ­సీ ఉప ఎన్నిక పో­లిం­గ్‌ కోసం అధి­కా­రు­లు కట్టు­ది­ట్ట­మైన ఏర్పా­ట్లు చే­స్తు­న్నా­రు. పు­లి­వెం­దుల ఎన్నిక ప్ర­తి­ష్టా­త్మ­కం­గా జరు­గు­తుం­డ­టం­తో పో­లిం­గ్‌ కేం­ద్రా­ల­న్నిం­టి­నీ సమ­స్యా­త్మ­క­మై­న­వి­గా గు­ర్తిం­చా­రు. వె­బ్‌ క్యా­స్టిం­గ్‌­తో పాటు ఆర్మ్‌­డ్‌ ఫో­ర్స్‌­తో పటి­ష్ఠ బం­దో­బ­స్తు ఏర్పా­టు చే­శా­రు.

పులివెందులలో అన్ని సమస్యాత్మకమే

కడప జి­ల్లా­లో­ని పు­లి­వెం­దుల, ఒం­టి­మి­ట్ట జడ్పీ­టీ­సీ స్థా­నా­ల­కు నేడు పో­లిం­గ్‌ జర­గ­నుం­ది. పు­లి­వెం­దుల జడ్పీ­టీ­సీ­స్థా­నా­ని­కి 11 మంది బరి­లో ఉం­డ­గా 15 పో­లిం­గ్‌ కేం­ద్రా­ల్లో 10 వేల 600 మంది ఓటు హక్కు వి­ని­యో­గిం­చు­కో­ను­న్నా­రు. ఒం­టి­మి­ట్ట జడ్పీ­టీ­సీ స్థా­నా­ని­కి కూడా 11 మంది పోటీ చే­స్తు­న్నా­రు. 30 పో­లిం­గ్‌ కేం­ద్రా­ల్లో 24 వేల మంది ఓటు వే­య­ను­న్నా­రు. పో­లిం­గ్‌ కోసం అధి­కా­రు­లు ము­మ్మర ఏర్పా­ట్లు చే­స్తు­న్నా­రు. బ్యా­లె­ట్‌ వి­ధా­నం­లో పో­లిం­గ్‌ ని­ర్వ­హి­స్తుం­డ­గా ఇప్ప­టి­కే రెం­డు మం­డ­లా­ల్లో­ని ఓట­ర్ల­కు స్లి­ప్పు­లు అం­ద­జే­సే ప్ర­క్రియ పూ­ర్త­యిం­ది. పు­లి­వెం­దుల ఎన్ని­కల ప్ర­చా­రం­లో ఘర్ష­ణ­లు తలె­త్త­డం­తో ప్ర­త్యేక బం­దో­బ­స్తు ఏర్పా­టు చే­సి­న­ట్లు. రెం­డు ప్రాం­తా­ల్లో సమ­స్యా­త్మక ప్రాం­తా­లు గు­ర్తిం­చి వె­బ్‌­క్యా­స్టిం­గ్‌, సీ­సీ­టీ­వీ­లు ఏర్పా­టు చే­సి­న­ట్లు వె­ల్ల­డిం­చా­రు. పు­లి­వెం­దు­ల­లో పో­లిం­గ్ బూ­త్‌­ల­న్నిం­టి­నీ సు­న్ని­త­మై­న­వి­గా ప్ర­క­టిం­చా­రు. అన్ని చో­ట్ల  వె­బ్‌­కా­స్టిం­గ్ ఏర్పా­టు చే­య­స్తు­న్నా­రు. ఒంటి మి­ట్ట­లో వె­బ్‌­కా­స్టిం­గ్ లేని కేం­ద్రా­ల్లో మై­క్రో-ఆబ్జ­ర్వ­ర్స్ ను ని­య­మిం­చా­రు. APSP బా­టా­లి­య­న్స్, మొ­బై­ల్ సర్వై­లె­న్స్ వా­హ­నా­లు, డ్రో­న్స్, క్ల­స్ట­ర్ ఆధా­రిత పో­లీ­స్ పర్య­వే­క్ష­ణ­తో సహా అన్ని స్థా­యి­ల్లో భద్ర­తా  పటి­ష్టం­గా చే­శా­రు. పు­లి­వెం­దుల పట్ట­ణం ము­న్సి­పా­లి­టీ­గా ఉంది. అలా­గే ఒం­టి­మి­ట్ట మం­డ­లం­లో  13 గ్రామ పం­చా­య­తీ­లు,  24,606 ఓట­ర్లు ఉన్నా­రు. పు­లి­వెం­దుల నుం­చి వి­వే­కా హత్య కే­సు­లో నిం­ది­తు­డి­గా ఉన్న సు­నీ­ల్ యా­ద­వ్ పోటీ చే­స్తు­న్నా­రు. పు­లి­వెం­దుల జడ్పీ­టీ­సీ ఉప ఎన్ని­క­ల్లో మాజీ జడ్పీ­టీ­సీ మహే­శ్వ­ర్ రె­డ్డి కు­మా­రు­డు హే­మం­త్ రె­డ్డి­ని వై­సీ­పీ ఎన్ని­కల బరి­లో ని­లి­పిం­ది. చని­పో­యిన వై­సీ­పీ నేత కు­టుం­బా­ని­కి అం­డ­గా ఉన్నాం అన్న భరో­సా కల్పి­స్తూ ఈ టి­కె­ట్ కే­టా­యిం­చి­న­ట్లు స్ప­ష్టం చే­స్తోం­ది.

పటిష్ట చర్యలు తీసుకున్నాం: కలెక్టర్

'గత ఎన్ని­క­ల­లో జరి­గి­న­టు­వం­టి అం­శా­లు అన్నీ, అలా­గే అక్కడ ఉన్న­టు­వం­టి లా అండ్ ఆర్డ­ర్​ ఆధా­రం­గా కట్టు­ది­ట్ట­మైన ఏర్పా­ట్లు చే­య­డం జరి­గిం­ది. పు­లి­వెం­దుల, ఒం­టి­మి­ట్ట సరి­హ­ద్దు­ల్లో 15 చె­క్​­పో­స్టు­లు ఉన్నా­యి. ఆ 15 చో­ట్ల వె­బ్‌­క్యా­స్టిం­గ్‌, సీసీ కె­మె­రాల పర్య­వే­క్ష­ణ­లో జరు­గు­తుం­ది. ఒం­టి­మి­ట్ట­లో వె­బ్​ క్యా­స్టిం­గ్ ఏర్పా­టు చే­య­డం జరి­గిం­ది. ఎక్క­డై­తే వె­బ్​ క్యా­స్టిం­గ్ ఇవ్వ­లే­దో అక్కడ మై­క్రో అబ్జ­ర్వ­ర్స్న్​­ని ని­య­మిం­చ­డం జరి­గిం­ది.' అని కలె­క్ట­ర్ శ్రీ­ధ­ర్‌ వె­ల్ల­డిం­చా­రు.

పటిష్ట బందోబస్తు: ఎస్పీ

ఎన్ని­కల నే­ప­థ్యం­లో కర్నూ­లు రేం­జ్‌ డీ­ఐ­జీ కోయ ప్ర­వీ­ణ్‌ జి­ల్లా­లో­నే మకాం వేసి ఏర్పా­ట్లు పర్య­వే­క్షి­స్తు­న్నా­రు. పు­లి­వెం­దు­ల­లో 700 మంది, ఒం­టి­మి­ట్ట­లో 700 మంది పో­లీ­సు­ల­తో బం­దో­బ­స్తు ఏర్పా­టు చే­సి­న­ట్లు ఎస్పీ అశో­క్‌ కు­మా­ర్‌ తె­లి­పా­రు. పో­లిం­గ్‌ ము­గి­సే­వ­ర­కు స్థా­ని­కే­త­రు­లె­వ­రూ ఉం­డ­కూ­డ­ద­ని హె­చ్చ­రిం­చా­రు. 'ఒక ప్రాం­తం నుం­చి దా­దా­పు 5 లేదా 6 పో­లిం­గ్ బూ­త్​­ల­ను కలు­పు­తూ రూ­ట్​ మొ­బై­ల్స్​­గా డి­వై­డ్​ చే­శాం. ఆ రూ­ట్​­లో ఉన్న­టు­వం­టి అన్ని పో­లిం­గ్ కేం­ద్రా­ల­ను కవర్ చే­స్తూ టీ­మ్​­లు ఏర్పా­టు చే­య­డం జరి­గిం­ది. ఎలాం­టి అవాం­ఛ­నీయ సం­ఘ­ట­న­లు జర­గ­కుం­డా ప్ర­త్యేక బం­దో­బ­స్తు ఏర్పా­ట్లు చే­శాం. పు­లి­వెం­దుల, ఒం­టి­మి­ట్ట రెం­డు మం­డ­లా­ల­కు సం­బం­ధిం­చి పరి­సర ప్రాం­తా­ల్లో దా­దా­పు 15 వరకు చె­క్​­పో­స్టు­ల­ను ఏర్పా­టు చే­సాం. ఓటు వే­య్యా­లం­టే కచ్చి­తం­గా ఆ చె­క్​­పో­స్టు­ల­ను దా­టు­కు­నే వె­ళ్లా­లి.' అని ఎస్పీ అశో­క్‌­కు­మా­ర్ తె­లి­పా­రు.

వైసీపీ పిటిషన్ తిరస్కరణ 

అం­త­కు ముం­దు పో­లిం­గ్ బూ­త్‌­ల­ను వేరే చోట ఏర్పా­టు చే­శా­రం­టూ హై­కో­ర్టు­లో వై­సీ­పీ వే­సిన పి­టి­ష­న్ పై వి­చా­రమ జరి­గిం­ది.   ఎమ్మె­ల్సీ లే­ళ్ల అప్పి­రె­డ్డి దా­ఖ­లు చే­సిన పి­టి­ష­న్‌­ను సో­మ­వా­రం ఏపీ హై­కో­ర్టు­లో వి­చా­రణ జరి­గిం­ది.  పో­లిం­గ్ బూ­త్‌ల మా­ర్పు­లో జో­క్యా­న్ని ఏపీ హై­కో­ర్టు ని­రా­క­రిం­చిం­ది. ఈ జడ్పీ­టీ­సీ ఎన్ని­క­ల్లో ఆరు పో­లిం­గ్ బూ­త్‌­లు మా­ర్చా­ల­ని అవి ఓట­ర్ల­కు దూ­రం­గా ఉన్నా­య­ని  లే­ళ్ల అప్పి­రె­డ్డి తన పి­టి­ష­న్‌­లో కో­రా­రు. అయి­తే  పో­లిం­గ్  ఏర్పా­ట్లు పూ­ర్త­వు­తు­న్న సమ­యం­లో  ఇలా మా­ర్చ­డం సా­ధ్యం కా­ద­ని ఎస్‌­ఈ­సీ లా­ర్లు­స్ప­ష్టం చే­శా­రు. దీం­తో జో­క్యా­ని­కి హై­కో­ర్టు ని­రా­క­రిం­చిం­ది.   

Tags:    

Similar News