సినీనటి మాధవీలతపై అనంతపురం జిల్లా తాడిపత్రిలో కేసు నమోదైంది.డిసెంబర్ 31న తాడిపత్రి JC పార్కులో నిర్వహించిన న్యూ ఇయర్ వేడుకలపై మాధవీలత చేసిన వ్యాఖ్యలు మహిళలను కించపరిచేలా ఉన్నాయని SC కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ కమలమ్మ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు తాడిపత్రి పట్టణ CI సాయిప్రసాద్ తెలిపారు. మాధవీలత వ్యాఖ్యలపై JC ప్రభాకర్ రెడ్డి ఘాటుగా స్పందించి ఆపై ఆమెకు సారీ చెప్పిన విషయం తెలిసిందే.
కాగా గత నెల 21న సోషల్ మీడియాలో తనను టార్గెట్ చేసి బెదిరిస్తున్నారని సైబరాబాద్ సీసీఎస్‌లో ఆమె కంప్లైంట్ ఇచ్చారు. జేసీ అనుచరులు, అభిమానులు తనను చంపుతామని బెదిరిస్తున్నారని పేర్కొన్నారు. జేసీ తనను అసభ్యపదజాలంతో దూషించారని ఆమె ఫిర్యాదులో తెలిపారు. అయితే తన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు రావడంతో జేసీ ప్రభాకర్ రెడ్డి వెనక్కి తగ్గారు. సినీ నటి మాధవీలతకు బహిరంగ క్షమాపణలు చెప్పారు. ఆవేశంలో నోరు జారాను, టంగ్ స్లిప్ అయింది.. సారీ అంటూ వ్యాఖ్యానించారు.
క్షమాపణలు చెప్పిన తర్వాత కూడా మాధవి కన్నీళ్లు పెట్టుకుని ఒక వీడియో పంచుకుంది. ‘మహిళల మాన, ప్రాణ రక్షణ గురించి మాట్లాడినందుకు తనను అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని వాపోయింది. మామూలుగా ఉందామని చాలా ప్రయత్నించా.. కానీ నావల్ల కావడం లేదంటూ’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.