రెండు రోజుల క్రితం వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి పేర్ని నాని చేసిన వ్యాఖ్యలపై విజయవాడలోని 2 టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది. జూలై 11న వైఎస్సార్‌సీపీ నిర్వహించిన సామాజిక న్యాయ భేరి లో పేర్ని నాని చేసిన వ్యాఖ్యలు సమాజంలో విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని, కులాల మధ్య చిచ్చు పెడుతున్నాయని గాంధీ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ వ్యాఖ్యలపై దర్యాప్తు జరుగుతుందని పోలీసులు తెలిపారు. ఇటీవల వైఎస్సార్‌సీపీ నిర్వహించిన "సామాజిక న్యాయ భేరి"లో భాగంగా, పేర్ని నాని మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌లను ఉద్దేశించి తీవ్ర విమర్శలు చేశారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపాయి. ముఖ్యంగా, సామాజిక వర్గాల గురించి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.