Guntakal: అవినీతి కేసులో రైల్వే డీఆర్ఎంను అరెస్ట్ చేసిన సీబీఐ

అవినీతి కేసులో గుంతకల్లు రైల్వే డీఆర్‌ఎంను అరెస్ట్‌ చేసిన సీబీఐ;

Update: 2024-07-07 04:00 GMT

అనంతపురం జిల్లా గుంతకల్లు రైల్వే డీఆర్‌ఎం వినీత్ సింగ్ తో పాటు నలుగురు అధికారులను సీబీఐ అధికారులు అరెస్ట్ చేసి కర్నూలు ఏసీబీ కోర్టులో హాజరుపర్చారు. గుంతకల్లు రైల్వే డీఆర్‌ఎం కార్యాలయంలో మూడు రోజులుగా కొనసాగుతున్న సీబీఐ దాడులు ముగిశాయి. ఎట్టకేలకు అవినీతి అధికారులు సీబీఐ చేతికి చిక్కారు. కాంట్రాక్టర్ల ఫిర్యాదు మేరకు నిర్వహించిన దాడులలో గుంతకల్ డీఆర్ఎం వినీత్ సింగ్ తో పాటు మరో నలుగురు అధికారులను సీబీఐ అధికారులు అరెస్టు చేసారు. వీరిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. గుంతకల్‌ డీఆర్‌ఎం వినీత్ సింగ్, డివిజనల్ ఫైనాన్షియల్ మేనేజర్ ప్రదీప్ బాబు, ఇంజనీరింగ్ సెక్షన్ ఓఎస్‌ బాలాజీ,లక్ష్మీపతి రాజు,

సికింద్రాబాద్ డివిజన్ సీనియర్ డీఈఎన్ కోఆర్డినేషన్ సౌత్ అక్కిరెడ్డి లను అరెస్టు చేశారు. వీరితో పాటు ఇద్దరు కాంట్రాక్టర్లను కూడా అరెస్టు చేశారు. అనంతరం కర్నూలు ఏసీబీ కోర్టులో జడ్జి ముందు హాజరుపరిచారు.గుంతకల్లు డీఆర్‌ఎం కార్యాలయంలోని ఫైనాన్స్, ఇంజనీరింగ్ విభాగాలతో పాటుగా రైల్వేలో పనులను వేగవంతంగా పూర్తి చేయడానికి త్వరగా అనుమతులు పొందడానికి గతి శక్తి విభాగాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఈ గతిశక్తి విభాగంలో బ్రిడ్జ్ ల పనులను నిర్వహించిన కాంట్రాక్టర్లు అవినీతి అధికారులు పై ఫిర్యాదు చేయడంతో సీబీఐ రంగంలోకి దిగింది. ఈ దాడులు మూడు రోజులు కొనసాగగా, అంతకు ముందు నుండే అధికారులపై సీబీఐ ప్రత్యేక బృందం నిఘాని ఉంచింది .

దక్షిణ మధ్య రైల్వే చరిత్రలో ఒక డీఆర్‌ఎం స్థాయి వ్యక్తిని అవినీతి ఆరోపణలతో ఆధారాలతో సహా అరెస్టు చేయడం ఇదే మొదటిసారి. ఈ అవినీతి అధికారుల ఇళ్లలో కూడా సీబీఐ మూడు రోజుల పాటు సోదరులు నిర్వహించింది అంతేకాకుండా ఈ శాఖ లలో రైల్వే శాఖ అనుమతి పొంది జరిగిన పనులు వాటికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలు, వీరి కుటుంబ సభ్యుల ఆర్థిక లావాదేవీలు కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద రైల్వే శాఖలోని అత్యున్నత స్థాయి అధికారులు పట్టుబడటం సంచలనం కలిగించడమే కాకుండా రైల్వే శాఖలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Tags:    

Similar News