YSRCP : వైసీపీ వింత డిమాండ్స్.. కల్తీ నెయ్యి తప్పు కాదంట..

Update: 2026-01-31 05:30 GMT

వైసీపీ నేతల తీరు మరీ దారుణంగా ఉంది. తిరుమల శ్రీవారి లడ్డూను కల్తీ చేశారని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్ తేల్చినా సరే.. అది తప్పు కాదన్నట్టు మాట్లాడుతున్నారు. తిరుమల చరిత్రలోనే ఇంత పెద్ద నేరం ఎవరూ చేయలేదని అధికారులు చెబుతుంటే.. అబ్బే అదేమంత తప్పు కాదు. జంతువుల కొవ్వు కలవలేదు కదా అంటూ వింత డిమాండ్లు చేస్తున్నారు వైసీపీ నేతలు. కూటమి ప్రభుత్వం జంతువుల కొవ్వు కలిసిందంటూ తప్పుడు ప్రచారాలు చేసిందని.. ఇప్పుడు జంతువుల కొవ్వ కలవలేదు కాబట్టి క్షమాపణ చెప్పాలంటూ కోరుతున్నారు.

ఇది విన్నవారంతా నిజంగానే నోరెళ్లబెడుతున్నారు. అసలు పాలు లేకుండా నెయ్యిని పామాయిల్, ఇతర కెమికల్స్ తో తయారు చేసి లడ్డూల్లో కలిపేసినా అది వారికి పెద్ద నేరంగా కనిపించట్లేదు. కానీ కూటమి నేతలు చేసిన ఆరోపణల్లో నిజంలేదని వాదిస్తున్నారు. ఇంత దారుణం ఎక్కడైనా ఉంటుంది. వైసీపీ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు అంతా ఇదే బాట. వాళ్ల ఉద్దేశం ఒక్కటే.. కల్తీ నెయ్యి కేసు నుంచి ప్రజలను గందరగోళానికి గురి చేయాలి అనుకుంటున్నారు.

వాళ్లు సైలెంట్ గా ఉంటే నిజాన్ని ఒప్పుకున్నట్టే అవుతుంది కాబట్టి ఇలాంటి వింత వాదనలకు దిగుతున్నారు. వాళ్లు ఎన్ని కామెంట్లు ఇలాంటివి చేసినా సరే ప్రజలు వారిని అస్సలు క్షమించరు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఎందుకంటే వైసీపీ నేతలు కల్తీ నెయ్యిని లడ్డూల్లో కలిపేసి చేసి శ్రీవారి భక్తులతో తినిపించారు. కాబట్టి వారు ఎన్ని వాదనలు చేసినా ప్రజలు, భక్తులు వారిని అస్సలు క్షమించరనేది గుర్తుంచుకోవాలి.

Tags:    

Similar News