CBN: అక్కాచెల్లెళ్ల చంద్రబాబు రాఖీ పండుగ శుభాకాంక్షలు

రక్షాబంధన్.. తమ్ముడికి ప్రాణం పోసిన అక్క;

Update: 2025-08-09 02:34 GMT

తెలుగింటి ఆడపడుచులకు సీఎం చంద్రబాబు రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. 'అన్నా చెల్లెళ్ల అనుబంధానికి శుభ సందర్భమే రాఖీ పర్వదినం. మీ కోసం నేనున్నాను. రాఖీ పౌర్ణమి మనందరికి ప్రత్యేకం. మీ అందరికి ఒక అన్నగా మీకు రక్షణ కల్పించే, మీ జీవితాల్లో వెలుగులు నింపే బాధ్యత నాది. ఆడబిడ్డల బాగుకోసం అహర్నిశలూ పని చేస్తా.' అంటూ ట్వీట్ చేశారు. 

రక్షాబంధన్.. తమ్ముడికి ప్రాణం పోసిన అక్క

రక్షాబంధన్ తోబుట్టువులకు పవిత్రమైన పండుగ. ప్రతి కష్టంలో సోదరులు తోడుంటారనే విశ్వాసానికి గుర్తు. ఈ పవిత్రమైన పండుగకు ప్రత్యేక సాక్ష్యంగా నిలించింది శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలంలోని బడ్డవానిపేటకు చెందిన తిరుపతమ్మ. తన తమ్ముడు వజ్జ ప్రసాదరావుకి ఏకంగా కిడ్నీని దానం చేసింది. ప్రస్తుతం భార్యాపిల్లలతో అతను హాయిగా జీవిస్తున్నారు. అక్క త్యాగాన్ని తాను ఎప్పటికీ మర్చిపోలేనని తమ్ముడు చెబుతున్నాడు.

5000 ఏళ్లుగా నడుస్తున్న రాఖీ ట్రెండ్

శ్రావణ శుద్ధ పూర్ణిమను రాఖీపూర్ణిమగా జరుపుకుంటారు. అయితే ఈ రాఖీ ట్రెండ్ 5వేల ఏళ్ల క్రితమే మొదలైందట. త్రేతాయుగంలో శాంతా దేవీ తన నలుగురు తమ్ముళ్లు అయిన శ్రీరాముడు, భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నులకు తొలిసారి రాఖీ కట్టిందట. అదే సంప్రదాయం నేటికీ నడుస్తోంది. అందుకే అయోధ్యలో శాంతాదేవీకీ ఒక గుడి ఉంది. అక్కడి నుంచే తొలి రాఖీ వేడుకను మొదలవుతుందట. అయోధ్యకు ఏటా వేలల్లో రాఖీలు వస్తాయని భక్తులు చెబుతున్నారు.

శ్రీరామునికి రాఖీలు కట్టిన భక్తులు

అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల ప్రేమకు గుర్తుగా శ్రావణ శుద్ధ పూర్ణిమను రాఖీపూర్ణిమగా జరుపుకుంటారు. అయోధ్యలోనూ రాఖీ స్పెషల్‌ సెలబ్రేషన్స్‌ మొదలయ్యాయి. భక్తులు భారీగా తరలివచ్చి శ్రీరామునితో పాటు అతని సోదరులకు రాఖీలు కట్టారు. పురాణాల్లో చెప్పిన ప్రకారం శ్రీరామునికి శాంతా దేవి అనే ఒక అక్క ఉంటుంది. అందుకే అయోధ్యలోని మహిళలు తమకు తాము శాంతాగా భావించి శ్రీరామునికి ఏటా రాఖీలు కడుతుంటారు.

Tags:    

Similar News