CBN: జీఎస్టీ సంస్కరణలను ప్రజలకు వివరించండి
ప్రజా ప్రతినిధులకు చంద్రబాబు పిలుపు... సంస్కరణల ఉత్సవ్ చేపట్టాలన్న సీఎం... 60 వేల సమావేశాలు చేపట్టాలని ఆదేశం
తెలుగుదేశం పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, గ్రామస్థాయి కార్యకర్తలతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలకు పలు కీలక అంశాలపై సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ‘‘పార్టీ కార్యకర్తలైనా, నాయకులైనా ప్రజలకు దగ్గరగా ఉండాలి. ఎన్నికల సమయంలోనే ప్రజల వద్దకు వెళ్తానంటే ప్రజలు హర్షించరు. జీఎస్టీ సంస్కరణలను ప్రజలకు కార్యకర్తలు వివరించాలి. కూటమి పార్టీలు జీఎస్టీ సంస్కరణల ఉత్సవ్ ప్రచారం చేపట్టాలి. రాష్ట్రవ్యాప్తంగా 60 వేల సమావేశాలు పెట్టి ప్రజలకు వివరించాలి. 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలు శాసనసభకు రారు. ఆ పార్టీ ఎమ్మెల్సీలు మాత్రం సభకు వస్తున్నారు.. ఇదేం ద్వంద్వ వైఖరి?’’ అని చంద్రబాబు ప్రశ్నించారు. కేంద్రప్రభుత్వం తీసుకువచ్చిన నూతన జీఎస్టీ సంస్కరణలతో పేద, మధ్య తరగతి ప్రజలకు పెద్దఎత్తున లబ్ధి జరుగుతోందని ఉద్ఘాటించారు. దేశంలో ఇదొక నూతన అధ్యాయమని చెప్పుకొచ్చారు. జీఎస్టీ సంస్కరణలతో ఎన్డీఏ ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ మార్పులను ప్రజలకు వివరించి చెప్పాలని సూచించారు. జీఎస్టీ ఉత్సవ్‌లో భాగంగా జీఎస్టీ సంస్కరణలను వివరిద్దామని మార్గనిర్దేశం చేశారు. వైసీపీ హయాంలో అవలంబించిన అసమర్థ విధానాలతో ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం పడిందని చంద్రబాబు అన్నారు. విద్యుత్ రంగాన్ని గాడిన పెట్టి అనేక సమస్యలను పరిష్కరించామని చెప్పారు.
తక్కువ ధరకు విద్యుత్ కొనుగోళ్లు చేపట్టామని.. దీంతో రూ.వెయ్యి కోట్లు ఆదా అయినట్లు తెలిపారు. భవిష్యత్తులో ప్రజలపై రూ.వెయ్యి కోట్ల భారాన్ని తగ్గిస్తున్నామన్నారు. ప్రభుత్వం చేపడుతున్న ప్రతి కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యతను కార్యకర్తలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. కేంద్రం తీసుకొచ్చిన జీఎస్టీ సంస్కరణలతో పేద, మధ్య తరగతి ప్రజలకు పెద్ద ఎత్తున లబ్ధి జరుగుతుందని, దేశంలో నూతన అధ్యాయమని కొనియడారు. జీఎస్టీ సంస్కరణలతో ఎన్డీయే ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ మార్పులను ప్రజలకు వివరించి చెప్పాలని సూచించారు. కనీసం రాష్ట్ర వ్యాప్తంగా 60 వేల సమావేశాలు పెట్టి ప్రజలకు వివరించాలన్నారు. కూటమి పార్టీలు ఉమ్మడిగా జీఎస్టీ సంస్కరణ ఉత్సవ్ ప్రచారాన్ని నిర్వహించాలన్నారు.