CBN: తప్పు చేయను... తప్పు చేస్తే వదలను
శాసనసభలో సీఎం చంద్రబాబు స్పష్టీకరణ.. అందరూ వైసీపీ ప్రభుత్వ బాధితులే: సీఎం... తాను న్యాయబద్దంగా ఉంటానన్న చంద్రబాబు... చట్టాలకు మరింత పదును పెడతాం
జగన్ ప్రభుత్వంలో తానే మొదటి బాధితుడిని అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. శాసనసభలో ఆయన మాట్లాడుతూ.. తాను ఎప్పుడూ తప్పు చేయనని, న్యాయబద్ధంగా సరిగ్గా ఉంటానని చెప్పారు. ఎవరైనా తప్పులు చేస్తే మాత్రం వారి గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తామన్నారు. వైసీపీ పాలనలో పవన్ కల్యాణ్ ను కూడా హైదరాబాద్ నుంచి రాకుండా అడ్డుకున్నారని చెప్పారు. ఇలాంటి సంఘటనలు ఒకటి కాదు అనేకం ఉన్నాయన్నారు. తనది కక్ష రాజకీయాలు కాదని, బాధ్యత కలిగిన నాయకుణ్ణి కాబట్టే ప్రజలు నాలుగో సారి నన్ను సీఎం గా ఎన్నుకున్నారన్నారు. " 2003 లో అలిపిరిలో యాక్సిడెంట్ అయింది.. నేను మరో ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నాం. యాక్సిడెంట్ తర్వాత నేనే లేచి అంబులెన్స్ లో పడుకున్నా ఏమి జరిగింది అన్నాను. నక్సల్స్ బ్లాస్ట్ అన్నారు.. 23 క్లైమోర్ మైన్స్ బ్లాస్ట్ చేసినా నేను బయట పడ్డ.. వేంకటేశ్వర స్వామి మహిమ ఉందా అంటే.. ఉందనే చెప్పాలి" అని సీఎం అన్నారు. రాయలసీమలో ఫ్యాక్షన్ లేకుండా చెయ్యాలి అనుకున్న… పరిటాల రవిని ఆఫీస్ లో చంపేశారు.. వాళ్ళు చేసిన పనే మనం చేస్తే న్యాయం జరగదన్నారు. రాయలసీమలో ఫ్యాక్షన్ లేకుండా చెయ్యాలి అనుకున్న… పరిటాల రవిని ఆఫీస్ లో చంపేశారు.. వాళ్ళు చేసిన పనే మనం చేస్తే న్యాయం జరగదన్నారు.
నాకే నోటీసులు ఇస్తాడా..?
సీఐ శంకరయ్య ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబుకు లీగల్ నోటీసులివ్వడం పోలీసుశాఖలో కలకలం రేపింది. రాష్ట్ర చరిత్రలో ఇలాంటి పరిణామం ఎన్నడూ జరగలేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈ అంశంపై తాజాగా సీఎం చంద్రబాబు అసెంబ్లీలో స్పందించారు. శంకరయ్య మాట్లాడడానికి ఎంత ధైర్యం ఉండాలని తనకి లీగల్ నోటీసులు ఇచ్చిన శంకరయ్య పై సీఎం ఫైర్ అయ్యారు. శంకరయ్య అనే వ్యక్తిని తాను ఎప్పుడూ చూడలేదన్నారు. నేరస్తులకు అండగా ఉండే రాజకీయ నాయకులను ఇంత వరకు చూడలేదని.. కానీ ఇపుడు నేర ప్రవుత్తి ఉన్న వారే రాజకీయాలకు వస్తున్నారని సీఎం చంద్రబాబు అన్నారు. సీఐ డ్యూటీలో ఉన్నాడా లేదా? సీన్ ఆఫ్ అఫెన్స్ ను ఎవరు ప్రొటెక్ట్ చేయాలి..? అని చంద్రబాబు మండిపడ్డారు. సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారి కి సంబంధం లేదా..? అని నిలదీశారు. నేరస్తులతో కలిసి నా మీదనే కేసు పెట్టే స్థాయికి పరిస్థితి వచ్చిందంటే రాష్ట్రం ఎటు పోతుందని మండిపడ్డారు.. కారణం చెబితే పోలీసులు అనుమతి ఇస్తారు.. కానీ సమాచారం ఇవ్వకుండా యాత్రలు చేస్తే జరిగే పరిణామాలకు ఎవరు బాధ్యులు..? అని సీఎం ప్రశ్నించారు. రౌడీ ఇజం చేసే వారంతా రాజకీయం చేస్తున్నారు.. మహిళ పై నేరాలకు పాల్పడుతున్న 343 మందికి శిక్షలు పడ్డాయన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలంటే పార్టీలు ఉండాలని.. కూటమి ప్రభుత్వం పద్ధతి ప్రకారం పని చేస్తోందని సీఎం తెలిపారు.