జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. జెండాల మధ్య హీట్ పుట్టించే ఈ ఉప ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని రాజకీయ పార్టీ తెగ తాపత్రయ పడుతున్నాయి. ఏపీలో అఖండ విజయం సాధించిన కూటమి పార్టీలు.. తెలంగాణ ఉప ఎన్నికలో బరిలోకి దిగాలని పట్టుదలగా ఉన్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గెలవాలనే పట్టుదలతో వ్యూహ రచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో నందమూరి సుహాసినిని అభ్యర్థిగా బరిలోకి దించాలని పార్టీ ఆలోచిస్తున్నట్టు సమాచారం. ఈ ఎన్నికల్లో మిత్రపక్షాలైన బీజేపీ, జనసేనతో కలిసి ముందుకు సాగడమే కాక హైదరాబాద్‌లో ఉన్న పాత టీడీపీ క్యాడర్‌కు మళ్లీ చురుకుగా మార్చే లక్ష్యంతో టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు వ్యూహాన్ని సిద్ధం చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి.
తోక తిప్పితే కట్ చేస్తా: చంద్రబాబు
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌కు సీఎం చంద్రబాబు మాస్ వార్నింగ్ ఇచ్చారు. పర్యటనల పేరుతో మంచిగా తిరిగితే తనకు ఎలాంటి అభ్యంతరం లేదని, మభ్యపెట్టి ప్రజలకు అసౌకర్యం కల్పిస్తే ఊరుకోమని హెచ్చరించారు. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి తోక తిప్పితే, దానిని కట్ చేస్తామన్నారు. తోక తిప్పిన నేతలపై నేరుగా కేసులు పెడతామని స్పష్టం చేశారు. తమ పార్టీలో అయినా సరే నేతలు తప్పు చేస్తే చర్యలు తప్పవన్నారు. గతంలో జగన్ రైతులను మోసం చేశారని, రైతు భరోసా పేరుతోనూ చేసింది వంచనే అని చంద్రబాబు మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అలా కాకుండా కేంద్రం ఇచ్చే దాంతో కలిపి రూ.20వేలు రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్టు సీఎం స్పష్టం చేశారు.