CBN: ఎవరెన్ని కుట్రలు చేసినా... అమరావతి అభివృద్ధిని ఆపలేరు

అమరావతిని ప్రపంచం మెచ్చే రాజధాని చేస్తాం.. అభివృద్ధి వికేంద్రీకరణతో ప్రాంతాల అభివృద్ధి... జగన్ పాలనలో రాష్ట్రం సర్వ నాశనమైందన్న సీఎం

Update: 2026-01-25 03:30 GMT

2024 ఎన్ని­క­ల­కు ముం­దు ఆం­ధ్ర­ప్ర­దే­శ్ రా­ష్ట్రం తీ­వ్ర అని­శ్చి­తి, భయ­భ్రాం­తుల మధ్య గడి­చిం­ద­ని ము­ఖ్య­మం­త్రి చం­ద్ర­బా­బు నా­యు­డు అన్నా­రు. అప్ప­ట్లో ప్ర­జ­లు మా­ట్లా­డా­ల­న్నా, నవ్వా­ల­న్నా కూడా భయ­ప­డే పరి­స్థి­తి నె­ల­కొం­ద­ని ఆయన ఆవే­దన వ్య­క్తం చే­శా­రు. చి­త్తూ­రు జి­ల్లా నగ­రి­లో ని­ర్వ­హిం­చిన స్వ­ర్ణాం­ధ్ర – స్వ­చ్ఛాం­ధ్ర కా­ర్య­క్ర­మం­లో పా­ల్గొ­న్న సీఎం, రా­ష్ట్ర రా­జ­కీయ పరి­స్థి­తు­లు, పా­ల­న­లో వచ్చిన మా­ర్పు­లు, అభి­వృ­ద్ధి ప్ర­ణా­ళి­క­ల­పై వి­స్తృ­తం­గా మా­ట్లా­డా­రు.

కూ­ట­మి ప్ర­భు­త్వం అధి­కా­రం­లో­కి వచ్చిన తర్వాత కే­వ­లం 18 నెలల వ్య­వ­ధి­లో­నే రా­ష్ట్రా­ని­కి సు­మా­రు 20 లక్షల కో­ట్ల రూ­పా­యల పె­ట్టు­బ­డు­లు వచ్చా­య­ని చం­ద్ర­బా­బు వె­ల్ల­డిం­చా­రు. దే­శ­వ్యా­ప్తం­గా వచ్చిన వి­దే­శీ ప్ర­త్య­క్ష పె­ట్టు­బ­డు­ల్లో (ఎఫ్‌­డీఐ) 25 శాతం వాటా ఒక్క ఆం­ధ్ర­ప్ర­దే­శ్‌­కే దక్కిం­ద­ని చె­ప్పా­రు. ఇది కే­వ­లం సం­ఖ్యల వి­ష­యం మా­త్ర­మే కా­ద­ని, రా­ష్ట్రం­లో సు­ప­రి­పా­లన, పా­ర­ద­ర్శ­కత, పె­ట్టు­బ­డి­దా­రు­ల­కు అను­కూల వా­తా­వ­ర­ణం ఏర్ప­డిం­ద­నే దా­ని­కి స్ప­ష్ట­మైన ని­ద­ర్శ­న­మ­ని వ్యా­ఖ్యా­నిం­చా­రు. పె­ట్టు­బ­డి­దా­రు­లు నమ్మ­కం­తో ముం­దు­కు వస్తే­నే అభి­వృ­ద్ధి సా­ధ్య­మ­వు­తుం­ద­ని ఆయన తె­లి­పా­రు.రా­జ­ధా­ని అం­శం­పై కూడా సీఎం చం­ద్ర­బా­బు స్ప­ష్ట­మైన ప్ర­క­టన చే­శా­రు. ఆం­ధ్ర­ప్ర­దే­శ్ రా­జ­ధా­ని­గా అమ­రా­వ­తి శా­శ్వ­తం­గా కొ­న­సా­గు­తుం­ద­ని, ప్ర­పం­చం మె­చ్చే స్థా­యి­లో అమ­రా­వ­తి­ని అభి­వృ­ద్ధి చే­స్తా­మ­ని పు­న­రు­ద్ఘా­టిం­చా­రు. ఎవ­రె­న్ని అడ్డం­కు­లు సృ­ష్టిం­చి­నా, ఎం­త­టి కు­యు­క్తు­లు పన్ని­నా అమ­రా­వ­తి అభి­వృ­ద్ధి­ని అడ్డు­కో­వ­డం ఎవరి వల్లా కా­ద­ని స్ప­ష్టం చే­శా­రు. అభి­వృ­ద్ధి వి­కేం­ద్రీ­క­రణ సూ­త్రం­తో రా­ష్ట్రం­లో­ని అన్ని ప్రాం­తా­ల­ను సమా­నం­గా ముం­దు­కు తీ­సు­కె­ళ్ల­డ­మే తమ ప్ర­భు­త్వ లక్ష్య­మ­ని అన్నా­రు.

గత ఐదే­ళ్ల పా­ల­న­ను ప్ర­స్తా­వి­స్తూ చం­ద్ర­బా­బు తీ­వ్ర వి­మ­ర్శ­లు చే­శా­రు. ఆ కా­లం­లో రా­ష్ట్రం­లో అరా­చక పాలన కొ­న­సా­గిం­ద­ని, తన­లాం­టి వా­రి­నే జై­లు­కు పం­పిన పరి­స్థి­తు­లు చూ­శా­మ­ని చె­ప్పా­రు. సా­మా­న్య ప్ర­జ­లు తీ­వ్ర ఇబ్బం­దు­లు ఎదు­ర్కొ­న్నా­ర­ని, ప్ర­జా­స్వా­మ్య వి­లు­వ­ల­కు తూ­ట్లు పొ­డి­చా­ర­ని ఆరో­పిం­చా­రు. అయి­తే ప్ర­జ­లు ఈ పరి­స్థి­తు­ల­ను గమ­నిం­చి, ఎన్ని­క­ల్లో స్ప­ష్ట­మైన తీ­ర్పు ఇచ్చా­ర­ని చె­ప్పా­రు. 94 శాతం మంది అభ్య­ర్థు­ల­ను గె­లి­పిం­చ­డం ద్వా­రా ప్ర­జ­లు మా­ర్పు కో­రు­కు­న్నా­ర­ని, సమ­ర్థ నా­య­క­త్వా­ని­కి మద్ద­తు­గా ని­లి­చా­ర­ని చం­ద్ర­బా­బు అన్నా­రు. సమ­ర్థ నా­య­క­త్వం ఉం­టే­నే ప్ర­జల జీ­వి­తా­ల్లో పె­ను­మా­ర్పు­లు సా­ధ్య­మ­వు­తా­య­ని సీఎం పే­ర్కొ­న్నా­రు. చెడు చే­సి­న­వా­రి­ని ప్ర­జ­లు గు­ర్తు­పె­ట్టు­కు­ని తగిన బు­ద్ధి చె­బు­తా­ర­ని, మంచి చేసే ప్ర­భు­త్వా­ల­ను మా­త్రం ప్రో­త్స­హి­స్తా­ర­ని అన్నా­రు. ఎన్ని­క­ల­కు ముం­దు తాను ఇచ్చిన ప్ర­తి హా­మీ­కి కట్టు­బ­డి ఉన్నా­న­ని చె­ప్పా­రు. ము­ఖ్యం­గా కరెం­ట్ ఛా­ర్జీ­లు పెం­చ­బో­మ­ని ఇచ్చిన హా­మీ­ని గు­ర్తు చే­స్తూ, ఆ మా­ట­కు కట్టు­బ­డి ఉన్నా­మ­ని స్ప­ష్టం చే­శా­రు. వి­ద్యు­త్ కొ­ను­గో­లు ఖర్చు­ల­ను తగ్గిం­చే చర్య­లు తీ­సు­కుం­టూ, ప్ర­జ­ల­పై భారం పడ­కుం­డా చూ­స్తు­న్నా­మ­ని వి­వ­రిం­చా­రు. కూ­ట­మి ప్ర­భు­త్వం ప్ర­తి­ష్టా­త్మ­కం­గా అమలు చే­స్తు­న్న ‘సూ­ప­ర్ సి­క్స్’ పథ­కా­లు ప్ర­జ­ల్లో మంచి స్పం­దన పొం­దా­య­ని చం­ద్ర­బా­బు తె­లి­పా­రు. ఈ పథ­కా­ల­ను కే­వ­లం ప్ర­క­ట­న­ల­కే పరి­మి­తం చే­య­కుం­డా, అమ­ల్లో సూ­ప­ర్ హి­ట్‌­గా మా­ర్చా­మ­ని అన్నా­రు. గతం­లో చెడు ఆలో­చ­న­ల­తో, నే­ర­పూ­రిత ధో­ర­ణి­తో రా­జ­కీ­యా­లు చే­సి రా­ష్ట్ర భవి­ష్య­త్తు­ను ప్ర­మా­దం­లో­కి నె­ట్టా­ర­ని వి­మ­ర్శిం­చా­రు.

Tags:    

Similar News