CBN: పవన్ కల్యాణ్ ది గ్రేట్: చంద్రబాబు

Update: 2025-12-18 03:30 GMT

కలె­క్ట­ర్ కా­న్ఫ­రె­న్స్ లో డి­ప్యూ­టీ సీఎం పవన్ కల్యా­ణ్‌­పై సీఎం చం­ద్ర­బా­బు పొ­గ­డ్తల వర్షం కు­రి­పిం­చా­రు. డి­ప్యూ­టీ సీఎం వేరే రంగం నుం­చి వచ్చి­నా.. పరి­పా­ల­న­లో చక్క­టి పని­తీ­రు కన­బ­రు­స్తు­న్నా­ర­ని కని­యా­డా­రు.. 5,757 మం­ది­కి కా­ని­స్టే­బు­ళ్లు­గా ని­యా­మక పత్రా­లు ఇవ్వ­డం చాలా సం­తో­ష­మ­ని­పిం­చిం­ద­న్నా­రు. ని­యా­మ­క­ప­త్రం తీ­సు­కు­న్న ఓ కా­ని­స్టే­బు­ల్ తన ఊరి­కి రో­డ్డు లే­ద­ని అడి­గా­రు.. ఉప ము­ఖ్య­మం­త్రి­కి సమా­చా­రం అం­ది­స్తే.. తన శా­ఖ­కు సమా­చా­రం పంపి అదే వే­దిక నుం­చి ఆ రో­డ్డు­కు రూ.3.90 కో­ట్లు మం­జూ­రు చే­యిం­చా­ర­ని గు­ర్తు చే­శా­రు. తా­జా­గా అమ­రా­వ­తి­లో ఏర్పా­టు చే­సిన కలె­క్ట­ర్ల సమా­వే­శం­లో ము­ఖ్య­మం­త్రి ప్ర­సం­గిం­చా­రు. జి­ల్లాల కలె­క్ట­ర్ల సద­స్సు­లో మొ­క్కు­బ­డి చర్చ­లు కా­కుం­డా అర్థ­వం­త­మైన సమీ­క్ష, చర్చ­లు జర­గా­ల­న్నా­రు. అధి­కా­రు­లు, ప్ర­జా­ప్ర­తి­ని­ధు­లు ఎవ­రై­నా ని­త్య వి­ద్యా­ర్థి­గా­నే ఉం­డా­ల­న్నా­రు. ని­రం­త­రం వి­విధ అం­శా­ల­ను తె­లు­సు­కుం­టూ అభి­వృ­ద్ధి­లో భా­గ­మ­వ్వా­ల­ని పి­లు­పు­ని­చ్చా­రు. ప్ర­జా పా­ల­న­లో మె­రు­గైన ఫలి­తా­లు సా­ధిం­చేం­దు­కు వీ­లు­గా ఫీడ్ బ్యా­క్ తీ­సు­కుం­టు­న్నాం. జీ­ఎ­స్డీ­పీ, కే­పీఐ, సు­స్థి­రా­భి­వృ­ద్ధి లక్ష్యా­ల­ను సా­ధిం­చేం­దు­కు కలె­క్ట­ర్ల సద­స్సు­లో చర్చి­స్తు­న్నా­మ­ని తె­లి­పా­రు.

కలెక్టర్ల పాత్ర చాలా కీలకం

రా­ష్ట్ర అభి­వృ­ద్ధి­లో జి­ల్లా కలె­క్ట­ర్ల పా­త్ర ఎంతో కీ­ల­క­మ­ని, క్షే­త్ర­స్థా­యి­లో ప్ర­భు­త్వ పథ­కా­ల­ను ప్ర­జ­ల­కు చే­ర­వే­య­డం­లో వారు చూ­పు­తు­న్న చొరవ అభి­నం­ద­నీ­య­మ­ని డి­ప్యూ­టీ సీఎం పవన్ కళ్యా­ణ్ అన్నా­రు. అమ­రా­వ­తి­లో జరి­గిన జి­ల్లా కలె­క్ట­ర్ల సద­స్సు­లో ఆం­ధ్ర­ప్ర­దే­శ్ డి­ప్యూ­టీ సీఎం పా­ల్గొ­ని కీలక ప్ర­సం­గం చే­శా­రు. ఈ సం­ద­ర్భం­గా డి­ప్యూ­టీ సీఎం మా­ట్లా­డు­తూ ము­ఖ్యం­గా గ్రా­మీణ ప్రాం­తాల అభి­వృ­ద్ధి­కి తమ ప్ర­భు­త్వం పె­ద్ద­పీట వే­స్తోం­ద­ని స్ప­ష్టం చే­శా­రు. గత కొం­త­కా­లం­గా సా­ధిం­చిన ప్ర­గ­తి­ని వి­వ­రి­స్తూ.. సు­మా­రు 4 వేల కి­లో­మీ­ట­ర్ల మేర గ్రా­మీణ రహ­దా­రుల ని­ర్మా­ణా­న్ని పూ­ర్తి చే­శా­మ­ని వె­ల్ల­డిం­చా­రు. అలా­గే నీటి సం­ర­క్ష­ణ­లో భా­గం­గా లక్ష్యా­ని­కి అను­గు­ణం­గా 1.20 లక్షల ఫాం పాం­డ్స్ (పం­ట­కుం­ట­లు) తవ్వ­డం జరి­గిం­ద­ని తె­లి­పా­రు. ఉపా­ధి హామీ పథకం (నరే­గా) ద్వా­రా సు­మా­రు 4,330 కో­ట్ల రూ­పా­య­ల­ను వే­త­నాల రూ­పం­లో నే­రు­గా లబ్ధి­దా­రు­ల­కు చె­ల్లిం­చా­మ­ని అన్నా­రు. ఇది గ్రా­మీణ ఆర్థిక వ్య­వ­స్థ­కు ఎంతో ఊత­మి­చ్చిం­ద­ని డి­ప్యూ­టీ సీఎం పవన్ కల్యా­ణ్ పే­ర్కొ­న్నా­రు. కూ­ట­మి ప్ర­భు­త్వం సం­క్షే­మా­ని­కి పె­ద్ద పీట వే­స్తుం­ద­ని అన్నా­రు.

Tags:    

Similar News