CBN: రైతుల సమస్యలు పరిష్కరించండి

ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ఆదేశాలు... రైతుల సమస్యల పరిష్కారానికే అధిక ప్రాధాన్యం ఇవ్వాలన్నసీఎం

Update: 2025-11-27 04:00 GMT

 రాజధాని అమరావతి కోసం భూములు త్యాగం చేసిన రైతుల సమస్యల పరిష్కారానికి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. గత ప్రభుత్వ హయాంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న రాజధాని రైతులకు అండగా నిలవాలని, వారికి పూర్తి న్యాయం జరగాలని స్పష్టం చేశారు. బుధవారం సచివాలయంలో సీఆర్డీఏ కార్యకలాపాలపై ఆయన సమీక్ష నిర్వహించారు. రా­జ­ధా­ని ని­ర్మా­ణా­ని­కి భూ­ము­లు ఇచ్చిన రై­తు­లు గత ప్ర­భు­త్వ కా­లం­లో ఎన్నో కష్టా­లు ఎదు­ర్కొ­న్నా­ర­ని సీఎం పే­ర్కొ­న్నా­రు. వారి సమ­స్య­ల­ను అత్యంత ప్రా­ధా­న్యం­గా తీ­సు­కొ­ని తక్షణ పరి­ష్కా­రం చూ­పా­ల­ని అధి­కా­రు­ల­కు ఆదే­శిం­చా­రు. రై­తు­లు చే­సిన త్యా­గం వృథా కా­వొ­ద్దు అని పే­ర్కొ­న్నా­రు సీఎం చం­ద్ర­బా­బు.. వా­రి­కి ప్ర­భు­త్వం వైపు నుం­చి సం­పూ­ర్ణ న్యా­యం చే­యా­లి అని స్ప­ష్టం చే­శా­రు."గత ఐదేళ్లలో రాజధాని రైతులు సుదీర్ఘ పోరాటం చేశారు. వారికి ఏవైనా సాంకేతిక సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించాలి" అని పురపాలక, సీఆర్డీఏ శాఖలను ఆదేశించారు. రైతుల ఇబ్బందులను స్వయంగా తెలుసుకునేందుకు త్వరలోనే వారితో సమావేశం కావాలని పురపాలక శాఖ మంత్రి నారాయణకు, ఉన్నతాధికారులకు సూచించారు. ప్రభుత్వం కోసం త్యాగాలు చేసిన రైతులకు అదే స్థాయిలో సహకారం అందించడం మన బాధ్యత అని అన్నారు. ఇంకా ఏమైనా అపరిష్కృత అంశాలు మిగిలి ఉంటే, వాటిని కేబినెట్ సమావేశం దృష్టికి తీసుకురావాలని ఆదేశించారు.

త్వరలో రైతులతో భేటీ

రై­తు­లు ఎదు­ర్కొం­టు­న్న సాం­కే­తిక మరి­యు పరి­పా­ల­నా ఇబ్బం­దు­ల­ను ప్ర­త్య­క్షం­గా తె­లు­సు­కు­నేం­దు­కు త్వ­ర­లో వా­రి­తో సమా­వే­శం ఏర్పా­టు చే­యా­ల­ని మం­త్రి నా­రా­యణ మరి­యు అధి­కా­రు­ల­కు సీఎం ఆదే­శిం­చా­రు. అమ­రా­వ­తి నగర ని­ర్మాణ పను­ల­ను వే­గ­వం­తం చే­యా­ల­ని, నా­ణ్యత వి­ష­యం­లో ఎలాం­టి రాజీ పడ­వ­ద్ద­ని చం­ద్ర­బా­బు స్ప­ష్టం చే­శా­రు. వేగం, నా­ణ్యత, ప్లా­నిం­గ్.. ఈ మూడు అం­శా­ల­లో రాజీ లే­కుం­డా అమ­రా­వ­తి­ని ప్ర­పంచ స్థా­యి నగ­రం­గా తీ­ర్చి­ది­ద్ద­డ­మే ప్ర­భు­త్వ లక్ష్య­మ­ని తె­లి­పా­రు.

Tags:    

Similar News