CBN: మెగా డీఎస్సీని హిట్ చేసి చూపించాం

డీఎస్సీ విజేతలకు నియామక పత్రాల పంపిణీ.. 15,491 మందికి లెటర్లు అందజేసిన సీఎం.. అసాధ్యాన్ని సుసాధ్యం చేశామన్న చంద్రబాబు

Update: 2025-09-26 02:00 GMT

మెగా డీ­ఎ­స్సీ సా­ధ్య­మా అన్నా­రు.. మెగా డీ­ఎ­స్సీ­ని సూ­ప­ర్‌ హి­ట్‌ చేసి చూ­పిం­చా­మ­ని ము­ఖ్య­మం­త్రి చం­ద్ర­బా­బు అన్నా­రు. వె­ల­గ­పూ­డి­లో­ని సచి­వా­ల­యం సమీ­పం­లో ఏర్పా­టు చే­సిన వే­ది­క­పై 15,941 మంది మెగా డీ­ఎ­స్సీ వి­జే­త­ల­కు ని­యా­మక పత్రాల పం­పి­ణీ కా­ర్య­క్ర­మం అట్ట­హా­సం­గా జరి­గిం­ది. ఈ సం­ద­ర్భం­గా సీఎం మా­ట్లా­డు­తూ.. 150 రో­జు­ల్లో­నే డీ­ఎ­స్సీ పూ­ర్తి చే­సిన.. వి­ద్యా­శాఖ మం­త్రి లో­కే­శ్‌­ను అభి­నం­దిం­చా­రు. డీ­ఎ­స్సీ ద్వా­రా కొ­త్త­గా రి­క్రూ­ట్ అయిన టీ­చ­ర్ల­తో ము­ఖ్య­మం­త్రి చం­ద్ర­బా­బు, మం­త్రి నారా లో­కే­శ్ ము­ఖా­ము­ఖి ని­ర్వ­హిం­చా­రు. వి­జే­త­లు అడి­గిన ప్ర­శ్న­ల­కు చం­ద్ర­బా­బు, లో­కే­శ్ సమా­ధా­నా­లు ఇచ్చా­రు. రా­ష్ట్రం­లో ము­ఖ్య­మం­త్రు­లం­ద­రూ ఎం­త­మం­ది టీ­చ­ర్ల­ను ని­య­మిం­చా­రో.. నేను ఒక్క­డి­నే అంత మంది టీ­చ­ర్ల­ను ని­య­మిం­చా­ను అని సీఎం చం­ద్ర­బా­బు చె­ప్పా­రు. వి­ద్యా రం­గా­న్ని నేను ఎప్పు­డూ అశ్ర­ద్ధ­గా చూ­డ­లే­దు, ని­ర్ల­క్ష్యం చే­య­లే­ద­న్నా­రు. మొ­ద­టి సూ­ప­ర్ సి­క్స్‌ యు­వ­త­కు 20 లక్షల ఉద్యో­గా­లు కల్పిం­చ­డం అని.. అం­దు­లో భా­గం­గా మెగా డీ­ఎ­స్సీ­పై తొలి సం­త­కం చే­శా­న­ని చం­ద్ర­బా­బు తె­లి­పా­రు. మెగా డీఎస్సీని సూపర్ హిట్ చేశారని సీఎం చంద్రబాబు అన్నారు. మెగా డీఎస్సీని సమర్థవంతంగా నిర్వహించిన మంత్రి నారా లోకేశ్, టీంను ఆయన అభినందించారు. మగవాళ్లకంటే మహిళలే ఎక్కువగా చదువు చెప్పగలరని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఐదేళ్లు అధికారంలో ఉన్నా ఒక్క టీచర్ ను కూడా నియమించకుండానే క్వాలిటీ పెరిగిపోయిందని ప్రచారం చేశారని గత ప్రభుత్వంపై మండిపడ్డారు. రాష్ట్రంలో పేదరికంలేని సమాజం రావాలని చంద్రబాబు అన్నారు.


నా కోరిక మీ చేతుల్లో ఉంది..

”మీ కో­రిక ఉద్యో­గం. అది తీ­రిం­ది. నా కో­రిక ఈ రా­ష్ట్రం­లో పే­ద­రి­కం లేని సమా­జం రా­వా­లి. అది వి­ద్య వల్ల­నే సా­ధ్యం. ఆ బా­ధ్యత మీది. సి­ద్ధ­మా. మెగా డీ­ఎ­స్సీ సా­ధ్య­మా అన్నా­రు. మెగా డీ­ఎ­స్సీ­ని సూ­ప­ర్‌ హి­ట్‌ చేసి చూ­పిం­చాం. 150 రో­జు­ల్లో­నే డీ­ఎ­స్సీ పూ­ర్తి చే­సిన వి­ద్యా­శాఖ మం­త్రి లో­కే­శ్‌­ను­అ­భి­నం­ది­స్తు­న్నా” అని ము­ఖ్య­మం­త్రి చం­ద్ర­బా­బు అన్నా­రు.

 డిఎస్సీ అంటే సీబీఎన్…

సీఎం చం­ద్ర­బా­బు నా­యు­డు తనకు జీ­వి­త­కాల గు­రు­వ­ని­ఏ­పీ వి­ద్యా­శాఖ మం­త్రి నారా లో­కే­ష్ తె­లి­పా­రు. చం­ద్ర­బా­బు చె­ప్పిన వి­ధం­గా ఇకపై ప్ర­తి­ఏ­టా డి­ఎ­స్సీ ని­ర్వ­హి­స్తా­మ­ని వె­ల్ల­డిం­చా­రు. నవం­బ­ర్ లో టెట్ చే­ప­డ­తా­మ­ని.. వచ్చే­ఏ­డా­ది మళ్లీ పా­ర­ద­ర్శ­కం­గా డి­ఎ­స్సీ నో­టి­ఫి­కే­ష­న్ ఇస్తా­మ­ని లో­కే­ష్ హామీ ఇచ్చా­రు. దే­శా­ని­కి అధి­నేత అయి­నా సరే.. గు­రు­వు వద్ద పా­ఠా­లు నే­ర్చు­కో­వా­ల్సిం­దే­న­ని హి­త­వు పలి­కా­రు. తాను టె­న్త్ క్లా­స్ వరకూ నా­మ­మా­త్రం­గా­నే చది­వా­న­ని, ఫం­డ­మెం­ట­ల్స్ లో నా­రా­యణ లె­స­న్స్ చె­ప్పా­ర­ని తె­లి­పా­రు. ఇక అమె­రి­కా వె­ళ్లి­న­పు­డు ప్రొ­ఫె­స­ర్ రా­జి­రె­డ్డి తనకు వి­ద్యా­వ్య­వ­స్థ గు­రిం­చి చె­ప్పా­ర­న్నా­రు. వి­ద్య గు­రిం­చి తనకు అవ­గా­హన ఉం­ద­ని, అం­దు­కే తొలి సం­త­కం డీ­ఎ­స్సీ ఫైల్ పైనే పె­ట్టా­న­న్నా­రు. సీ­బీ­ఎ­న్ అంటే డీ­ఎ­స్సీ.. డీ­ఎ­స్సీ అంటే సీ­బీ­ఎ­న్ అని కొ­ని­యా­డా­రు. 150 రో­జు­ల్లో 150 కే­సు­లు పె­ట్టి­నా.. డీ­ఎ­స్సీ పో­స్టు­ల్ని భర్తీ చేసి చూ­పిం­చా­మ­న్నా­రు. 150రో­జు­ల్లో డి­ఎ­స్సీ ని­ర్వ­హిం­చ­డం ఒక చరి­త్ర, ఇది నె­వ­ర్ బి­ఫో­ర్, ఎవర్ ఆఫ్ట­ర్ అని పే­ర్కొ­న్నా­రు.

Tags:    

Similar News