CBN: సమాజంలో అలజడి సృష్టిస్తే ఎవరైనా వదలం

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హెచ్చరిక.. పోలీసుల అమరవీరుల దినోత్సవంలో పాల్గొన్న సీఎం.. కుట్రలు ముందే పసిగట్టి నిర్వీర్యం చేయాలని సూచన ## విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలన్న సీఎం

Update: 2025-10-21 09:00 GMT

పో­లీ­సు యం­త్రాం­గా­ని­కి మూడో కన్ను­లా సీసీ కె­మె­రా­లు పని­చే­స్తా­య­ని ఏపీ సీఎం చం­ద్ర­బా­బు అన్నా­రు. మం­గ­ళ­గి­రి­లో ని­ర్వ­హిం­చిన పో­లీ­సు అమ­ర­వీ­రుల సం­స్మ­రణ కా­ర్య­క్ర­మం­లో ఆయన పా­ల్గొ­న్నా­రు. రా­ష్ట్రం­లో ప్ర­తి 55 కి.మీ­ల­కు ఒక సీసీ కె­మె­రా ఏర్పా­టు చే­స్తు­న్నా­మ­ని తె­లి­పా­రు. టె­క్నా­ల­జీ సా­యం­తో ఎవరు, ఎక్కడ, ఏ తప్పు చే­సి­నా ఆధా­రా­ల­తో పట్టు­కు­నే పరి­స్థి­తి రా­వా­ల­న్నా­రు. ఈగ­ల్‌, శక్తి బృం­దాల ఏర్పా­టు­తో రా­ష్ట్ర పో­లీ­సు వ్య­వ­స్థ ఆద­ర్శం­గా ని­లి­చిం­ద­ని వారి సే­వ­ల్ని సీఎం చం­ద్ర­బా­బు కొ­ని­యా­డా­రు. శాం­తి­భ­ద్ర­త­ల­కు వి­ఘా­తం కలి­గిం­చే కు­ట్ర­ల­ను పసి­గ­ట్టా­ల­ని పో­లీ­సు­ల­కు చం­ద్ర­బా­బు సూ­చిం­చా­రు. అశాం­తి సృ­ష్టిం­చ­డా­ని­కి రా­జ­కీయ ము­సు­గు­లో నే­రా­లు చేసే వా­రి­ప­ట్ల అప్ర­మ­త్తం­గా ఉం­డా­ల­ని పో­లీ­సు­ల­కు హి­త­వు పలి­కా­రు. పా­స్ట­ర్ ప్ర­వీ­ణ్ మృతి చెం­దిన అం­శం­తో మతాల మధ్య చి­చ్చు­పె­ట్టా­ల­ని చూ­శా­ర­న్నా­రు. అం­బే­ద్క­ర్ వి­గ్ర­హా­ని­కి ని­ప్పు పె­ట్టి వేరే వా­ళ్ల­పై నెపం వేసి రా­జ­కీయ లబ్ది­పొం­దా­ల­ని చూ­శా­ర­న్నా­రు. పో­లీ­స్ వ్య­వ­స్థ సమ­ర్థం­గా ఉం­డా­ల­ని.. నే­ర­స్తు­లు భయ­ప­డే­లా పని చే­యా­ల­ని వా­రి­కి సీఎం సూ­చిం­చా­రు. ఈ సం­ద­ర్భం­గా సీఎం చం­ద్ర­బా­బు మా­ట్లా­డు­తూ.. గూ­గు­ల్‌ పె­ట్టు­బ­డు­లు వి­శా­ఖ­ప­ట్నం­కు వచ్చా­యం­టే.. అది ఒక నమ్మ­క­మ­న్నా­రు. అతి­పె­ద్ద పె­ట్టు­బ­డు­లు వస్తు­న్నా­యం­టే పా­రి­శ్రా­మి­క­వే­త్త­ల్లో నమ్మ­కా­న్ని కలి­గి­స్తు­న్నా­మ­ని ఆయన వి­వ­రిం­చా­రు.

 పోలీసులకు చంద్రబాబు వరాలు

విధి ని­ర్వ­హ­ణ­లో ప్రా­ణా­లు కో­ల్పో­యిన పో­లీ­సు­ల­కు ని­వా­ళు­ల­ర్పిం­చా­రు. పో­లీ­సుల సే­వ­ల­ను కొ­ని­యా­డు­తూ, వా­రి­కి పలు వరా­లు ప్ర­క­టిం­చా­రు. అలా­గే వై­ద్య సే­వ­లు, బీమా, డీఏ, సరెం­డ­ర్ లీవ్ చె­ల్లిం­పు వంటి అం­శా­ల­ను ప్ర­స్తా­విం­చా­రు. శాం­తి భద్ర­తల పరి­ర­క్ష­ణ­కు, సాం­కే­తి­క­త­ను ఉప­యో­గిం­చు­కో­వా­ల­ని పో­లీ­సు­ల­కు సూ­చిం­చా­రు. శాం­తి­భ­ద్ర­తల వి­ష­యం­లో రా­జీ­ప­డే­ది లే­ద­న్నా­రు. ఈ ఏడా­ది వి­ధి­ని­ర్వ­హ­ణ­లో 192 మంది పో­లీ­సు­లు అమ­రు­ల­య్యా­ర­న్నా­రు. ప్ర­జల రక్షణ కోసం ప్రా­ణా­ల­ను సైతం పణం­గా పె­డు­తు­న్న పో­లీ­సు­లు అంటే తనకు ఎప్పు­డూ గౌ­ర­వం ఉం­టుం­ద­న్నా­రు. పో­లీ­సు­ల­కు కొ­న్ని వరా­లు ప్ర­క­టిం­చా­రు. పో­లీ­సు­లు చే­సే­ది కే­వ­లం ఉద్యో­గం కాదు.. వారు చే­సే­ది ని­స్వా­ర్థ సేవ అన్నా­రు. వై­ద్య­సే­వ­ల­కు పో­లీ­సు­ల­కు 16 నె­ల­ల్లో రూ.33 కో­ట్లు వి­డు­దల చే­శా­మ­ని.. మర­ణిం­చిన 171 మంది పో­లీ­సు­ల­కు బీమా కింద రూ.23 కో­ట్లు అం­దిం­చా­మ­న్నా­రు. అలా­గే పో­లీ­స్ వ్య­వ­స్థ­ను మరింత బలో­పే­తం చే­స్తా­మ­న్నా­రు. పో­లీ­సు­ల­కు ఒక సరెం­డ­ర్ లీవ్ డబ్బు­ను రెం­డు వి­డ­త­ల్లో చె­ల్లి­స్తు­న్నా­మ­న్నా­రు. 6,100 కా­ని­స్టే­బు­ల్ ని­యా­మ­కా­ల­ను పూ­ర్తి చే­శా­మ­ని.. శా­ఖా­ప­ర­మైన పదో­న్న­తు­లు వచ్చే­లా చర్య­లు తీ­సు­కుం­టు­న్నా­మ­న్నా­రు.

Tags:    

Similar News