CBN: రాజకీయ ముసుగులో రౌడీయిజం చేస్తే సహించను

రాష్ట్ర బహిష్కరణ చేశానని గుర్తుంచుకోండి.. జంతు బలులతో భయబ్రాంతులకు గురిచేస్తారా.. తిరుపతిలో డీపీవోను ప్రారంభించిన చంద్రబాబు

Update: 2025-12-27 03:30 GMT

వైసీపీ నేతల జంతు బలులపై తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇటువంటి హింసాత్మక చర్యలకు ఎలాంటి స్థానం లేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో రౌడీయిజం, భయభ్రాంతులకు పాల్పడే చర్యలను సహించబోనని హెచ్చరించారు. చంద్రబాబు మాట్లాడుతూ, అధికార మదంతో కొంతమంది నేతలు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటూ జంతు బలుల పేరిట అమానుష చర్యలకు పాల్పడటం అత్యంత దురదృష్టకరమన్నారు. సమాజాన్ని వెనక్కి నెట్టే ఈ తరహా చర్యలు రాష్ట్ర ప్రతిష్ఠను దిగజారుస్తాయని ఆయన వ్యాఖ్యానించారు. ఆధునిక సమాజంలో విజ్ఞానం, తర్కం, చట్టపాలన ఉండాల్సిన చోట హింసాత్మక ఘటనలను ప్రోత్సహించడం ప్రజలకు తప్పు సంకేతాలను ఇస్తుందన్నారు. అధికారంలో ఉన్నవారు చట్టాన్ని గౌరవించకుండా ప్రవర్తిస్తే, సాధారణ ప్రజల్లో చట్టంపై నమ్మకం ఎలా నిలుస్తుందన్న ప్రశ్నను ఆయన లేవనెత్తారు.

పోలీసులూ అప్రమత్తంగా ఉండండి

హోం­మం­త్రి అనిత, డీ­జీ­పీ హరీ­ష్‌­కు­మా­ర్‌ గు­ప్తా, ఎస్పీ సు­బ్బ­రా­యు­డు­తో కలి­సి తి­రు­ప­తి­లో నూతన పో­లీ­సు కా­ర్యా­ల­యా­న్ని సీఎం చం­ద్ర­బా­బు శు­క్ర­వా­రం ప్రా­రం­భిం­చా­రు. గౌ­ర­వ­వం­ద­నం స్వీ­క­రిం­చి సం­ద­ర్శ­కుల పు­స్త­కం­లో తన అభి­ప్రా­యా­న్ని రా­సిన తర్వాత పో­లీ­సు­ల­ను ఉద్దే­శిం­చి మా­ట్లా­డా­రు. గత ప్ర­భు­త్వం ఐదే­ళ్ల­లో చే­సిన కా­ర్య­క్ర­మాల వల్ల ప్ర­జ­ల్లో ఇప్ప­టి­కీ అశాం­తి ఉంది. వై­సీ­పీ శ్రే­ణు­లు ఇంకా రౌ­డీ­యి­జం చే­యా­ల­ని ఆలో­చి­స్తు­న్నా­యి. పో­స్ట­ర్లు పె­ట్టి వారి నా­య­కు­డి పు­ట్టి­న­రో­జు చే­సు­కో­వ­చ్చు. అ చట్ట­ప­రి­ధి­లో ఎలాం­టి కా­ర్య­క్ర­మా­లు చే­సు­కు­న్నా అభ్యం­త­రం లే­ద­ని, రా­జ­కీయ ము­సు­గు­లో రౌ­డీ­యి­జం చే­స్తా­మం­టే ఉపే­క్షిం­చే­ది లే­ద­ని హె­చ్చ­రిం­చా­రు. ‘వై­సీ­పీ హయాం­లో 2019-24 మధ్య చాలా సమ­స్య­లు తలె­త్తా­యి. తి­రు­మ­ల­నూ అప­వి­త్రం చే­శా­రు. భక్తుల మనో­భా­వా­లు దె­బ్బ­తీ­శా­రు. వేం­క­టే­శ్వ­ర­స్వా­మి వి­ష­యం­లో ఎవ­రై­నా తప్పు చే­స్తే ఈ జన్మ­లో­నే శి­క్ష అను­భ­వి­స్తా­రు. తి­రు­ప­తి, తి­రు­మ­ల­లో ఏ చి­న్న అల­జ­డి చో­టు­చే­సు­కు­న్నా ప్ర­పం­చం దృ­ష్టి­ని ఆక­ర్షి­స్తుం­ది కా­బ­ట్టి జా­గ్ర­త్త­గా ఉం­డా­లి. తి­రు­ప­తి­ని నే­రా­లు లేని ప్ర­శాం­త­న­గ­రం­గా తీ­ర్చి­ది­ద్దా­లి. పది రో­జు­ల­పా­టు జరి­గే వై­కుంఠ ఏకా­ద­శి సం­ద­ర్భం­గా రద్దీ ఎక్కు­వ­గా ఉం­టు­న్నం­దున పో­లీ­సు­లు, తి­తి­దే అప్ర­మ­త్తం­గా వ్య­వ­హ­రిం­చా­లి. ఎక్కడ చి­న్న ఇబ్బం­ది తలె­త్తి­నా కఠిన చర్య­లు తీ­సు­కుం­టా. సాం­కే­తి­కత వి­ని­యో­గిం­చి రౌ­డీ­షీ­ట­ర్ల­పై నిఘా ఉం­చం­డి. ఇన్‌­వి­జి­బు­ల్‌ పో­లీ­సు, వి­జి­బు­ల్‌ పో­లీ­సిం­గ్‌ ఉం­డా­లి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు ది­శా­ని­ర్దే­శం చే­శా­రు.

టీడీపీ నేతలను కూడా జైలుకు పంపా...

‘రా­య­ల­సీ­మ­లో ము­ఠా­క­క్ష­లు అణ­చి­వే­శా. టీడీపీ నా­య­కుల ప్ర­మే­యం ఉంటే వా­రి­నీ జై­ళ్ల­కు పంపా. రౌ­డీ­ల­ను రా­ష్ట్ర బహి­ష్క­రణ చే­శా­న­ని గు­ర్తుం­చు­కోం­డి. దొం­గ­త­నం, నే­రా­లు చేసే వ్య­క్తు­లు పట్టు­బ­డ­తా­ర­ని గు­ర్తుం­చు­కో­వా­లి. నే­ర­స్థుల కంటే పో­లీ­సు­లు సమ­ర్థం­గా వ్య­వ­హ­రిం­చా­లి. అప్పు­డే వా­రి­కి అడ్డు­క­ట్ట పడు­తుం­ది. గుం­టూ­రు­లో వారి వా­హ­నం కిం­దే ఒక మని­షి­ని తొ­క్కి.. అం­బు­లె­న్స్‌­లో తీ­సు­కె­ళ్లి పో­లీ­సు­లే చం­పే­శా­ర­ని మృ­తు­డి కు­టుం­బ­స­భ్యు­ల­తో చె­ప్పిం­చా­రు. ఇలాం­టి కా­ర్య­క్ర­మా­లు చేసి ఇది అస­మ­ర్థ ప్ర­భు­త్వ­మ­ని చె­బి­తే ఊరు­కోం. సా­మా­జిక మా­ధ్య­మా­ల్లో ఇప్ప­టి­కీ వై­కా­పా శ్రే­ణు­లు నీ­చం­గా, అస­భ్యం­గా పో­స్టు­లు పె­డు­తు­న్నా­యి. హత్య­లు, అసాం­ఘిక కా­ర్య­క్ర­మా­లు చే­స్తే వది­లి­పె­ట్ట­వ­ద్ద­ని పో­లీ­సు­ల­కు స్ప­ష్టం­గా చె­ప్పా. అలాం­టి నా­య­కు­ల­ను నేను ప్రో­త్స­హిం­చ­ను’ అని సీఎం చం­ద్ర­బా­బు పే­ర్కొ­న్నా­రు. ‘కూ­ట­మి వచ్చాక దే­వా­ల­యా­ల్లో దొం­గ­త­నా­లు, దా­డు­లు తగ్గా­యి. పో­లీ­సు­లు గట్టి­గా ఉన్నా­ర­ని తె­లి­స్తే నే­ర­స్తు­లు దా­రి­లో­కి వస్తా­రు. నోరు పా­రే­సు­కుం­టాం.. ఇష్టా­రా­జ్యం­గా ఉం­టాం.. రౌ­డీ­యి­జం చే­స్తా­మం­టే ప్ర­భు­త్వం గట్టి­గా ఉం­టుం­ది. నేనూ తి­రు­ప­తి­లో­నే పు­ట్టి పె­రి­గా. ప్ర­తి వీధీ, సందూ తె­లు­సు’ అని హె­చ్చ­రిం­చా­రు. నో హె­ల్మె­ట్‌- నో పె­ట్రో­ల్‌ కా­ర్య­క్ర­మం అభి­నం­ద­నీ­యం. తుడా సహ­కా­రం­తో నూతన పో­లీ­సు కా­ర్యా­ల­యం­లో పచ్చ­ద­నం పెం­పొం­ది­స్తు­న్న కలె­క్ట­ర్, ఎస్పీ­ల­కు ప్ర­శం­స­లు’ అని చం­ద్ర­బా­బు అన్నా­రు.

Tags:    

Similar News