CBN: నష్టపోయిన ప్రతీ రైతును ఆదుకుంటాం
తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సీఎం ఏరియల్ సర్వే.. నేలకొరిగిన పంటలను పరిశీలించిన ముఖ్యమంత్రి.. నష్టం ఆరా తీసి రైతులకు ధైర్యం చెప్పిన సీఎం
మొంథా తుపాను పెనువిపత్తని.. రాష్ట్రానికి తీవ్రమైన నష్టం జరిగిందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. అనంతరం రోడ్డుమార్గంలో వెళ్లి అంబేడ్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం ఓడలరేవులో పునరావాస కేంద్రాన్ని పరిశీలించి, తుపాను బాధితులను పరామర్శించారు. బాధితులకు నిత్యావసరాలు, పరిహారం అందించారు. ‘‘మొంథా తుపానుపై ముందుగానే ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం. గతంలో తుపానుల సమయంలో పనిచేసిన అనుభవం నాకు ఉంది. ముందు జాగ్రత్తలు తీసుకుని ప్రాణ నష్టం లేకుండా చూశాం. ఆస్తి నష్టం కూడా చాలా వరకు తగ్గేలా చర్యలు తీసుకున్నాం. పలు జిల్లాల్లో వరి, ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. నెల్లూరు, ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో భారీ వర్షం నమోదైంది. ఆస్తి నష్టంపై నివేదిక వచ్చాక చర్యలు తీసుకుంటాం. కౌలు రైతులకు పరిహారం అందిస్తాం. మత్స్యకారులు, చేనేత కార్మికులకు అదనంగా 50 కిలోల చొప్పున బియ్యం ఇస్తున్నాం’’ అని సీఎం తెలిపారు. హెలికాప్టర్ ద్వారా బాపట్ల, పల్నాడు, కృష్ణా, కోనసీమ, ఏలూరు జిల్లాల్లో సీఎం చంద్రబాబు ఏరియల్ విజిట్ కొనసాగుతుంది. చిలకలూరిపేట, పర్చూరు, చీరాల, కోడూరు, నాగాయలంక మీదుగా ఓడలరేవు వరకు సీఎం చంద్రబాబు హెలికాఫ్టర్ నుంచి పరిశీలించారు. కోనసీమ జిల్లా, అల్లవరం మండలం ఓడలరేవులో సీఎం ల్యాండ్ అవనున్నారు. అనంతరం ఓడల రేవు నుంచి రోడ్డు మార్గాన ప్రయాణించి వర్షాలకు నీట మునిగిన పంట పొలాలను అధికారులతో కలిసి సీఎం చంద్రబాబు నాయుడు పరిశీలించారు. తుఫాన్ బాధితులను పరామర్శించారు.. రోడ్డు మార్గం ద్వారా అల్లవరం మండలం బెండమూర్లంక గ్రామానికి చేరుకున్న ఆయన.. తుఫాన్ కు నేలకొరిగిన వరి పొలాలను పరిశీలించారు.. పంట నష్టాలకు సంబంధించి రైతులను అడిగి తెలుసుకున్నారు.
ఇదీ పెను విపత్తు
ఇది పెనువిపత్తు.. రాష్ట్రానికి తీవ్ర నష్టం జరిగిందని సీఎం చంద్రబాబు అన్నారు. గతంలో తుఫాన్ల సమయంలో పనిచేసిన అనుభవం నాకుందన్న ఆయన.. మొంథా తుఫాన్‌పై ముందుగానే ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం అన్నారు.. అయితే, ఈ తుఫాన్ వల్ల రాష్ట్రానికి తీవ్రమైన నష్టం జరిగిందన్నారు.. ఏరియల్ సర్వే తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన.. ముందు జాగ్రత్తలు తీసుకుని మొంథా తుఫాన్ వల్ల ప్రాణ నష్టం లేకుండా చూశాం అన్నారు.. ఆస్తి నష్టం కూడా చాలా వరకు తగ్గేలా చర్యలు తీసుకున్నాం అని వెల్లడించారు.. పలు జిల్లాల్లో వరి, ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి.. నెల్లూరు, ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో భారీ వర్షం నమోదైందన్నారు.. ఆస్తి నష్టంపై నివేదిక వచ్చాక చర్యలు తీసుకుంటాం అని వెల్లడించారు.. కౌలు రైతులకు పరిహారం అందిస్తాం అన్నారు.. ఇక, మత్స్యకారులు, చేనేత కార్మికులకు అదనంగా 50 కిలోల చొప్పున బియ్యం ఇవ్వనున్నట్టు తెలిపారు.
నిత్యావసరాలు అందించండి
తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలకు నిత్యవసర సరుకులు అందించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. కలెక్టర్లు, అధికారులు, మంత్రులకు సూచనలు చేశారు. సమర్థంగా వ్యవహరించి నష్టనివారణ చర్యలు చేపట్టామని తెలిపారు. సీఎం నుంచి సచివాలయం సిబ్బంది వరకు అందరం టీమ్‌గా పనిచేశామని అన్నారు. మరో రెండు రోజులు ఇలానే పర్యటిస్తే.. మరింత ఊరట ఇవ్వగలమని చెప్పారు. తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాలని.. ప్రభుత్వం ఏం చేసిందో చెబుతూ సమస్యలు ఉంటే అడిగి తెలుసుకోవాలని మంత్రులు అధికారులకు సూచించారు. వివిధ విభాగాల్లో నష్టం అంచనా వేసి కేంద్రానికి నివేదిక అందించాలన్నారు. తుపాన్ కారణంగా ఇద్దరు మరణించారని చంద్రబాబు తెలిపారు. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు అందుబాటులో ఉంటే ప్రభుత్వంపై నమ్మకం కలుగుతుందని అన్నారు. మన చర్యలతో ప్రభుత్వంపై భరోసా పెరిగిందని తెలిపారు. ముందు జాగ్రత్తలతో చాలా నష్టాన్ని నివారించగలమని చంద్రబాబు తెలిపారు. సమర్థంగా వ్యవహరించి నష్ట నివారణ చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. సీఎం నుంచి సచివాలయం సిబ్బంది వరకు అందరం టీమ్‌గా పనిచేశామని చెప్పారు.